సింగపూర్(Singapore) అధికారులు భారత సంతతికి చెందిన వ్యక్తి తంగరాజు సుప్పయ్య(Tangaraju Suppiah)ను ఉరి తీశారు. అతడు చేసిన నేరమేమిటంటే కిలో గంజాయిని సింగపూర్‌కు అక్రమంగా తరలించే ప్రయత్నం చేయడం! ఇది అక్కడ పెద్ద నేరం. అందుకే కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ శిక్షను అధికారులు అమలు చేశారు. సింగపూర్‌లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి.

కిలోకు పైగా ఉన్న గంజాయిని సింగపూర్‌కు రవాణా చేసేందుకు తంగరాజు ప్రయత్నించాడు. ఆ సమయంలోనే పోలీసులు అతడిని పట్టుకున్నారు. వైద్యపరీక్షలో తంగరాజు డ్రగ్స్ తీసుకున్నాడని తేలింది. మాదకద్రవ్యాలు సేవించడం కూడా నేరమే అక్కడ! దీంతో తంగరాజుకు అక్టోబర్ 9, 2018లో కోర్టు ఉరిశిక్ష విధించింది. మొన్న బుధవారం తెల్లవారుజామున చాంగి జైలులో తంగరాజును ఉరి తీశారు. తంగరాజుకు క్షమాభిక్ష పెట్టాలని పాపం ఆయన కుటుంబసభ్యులు చాలా ప్రయత్నించారు. ఐక్యరాజ్యసమితి యాక్టవిస్టులు కూడా విజ్ఞప్తులు చేశారు. సింగపూర్ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. క్షమాభిక్ష కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్‌కు చివరి నిమిషంలో కూడా లేఖ రాశారు కుటుంబసభ్యులు, యాక్టివిస్టులు. అయినా ఉరి ఆగలేదు. తాను నేరం చేయలేదని తంగరాజు రుజువు చేసుకోలేకపోయాడు. విచారణ సమయంలో కూడా అతడికి పెద్దగా మద్దతు లభించలేదు. గత వారం తమకు తంగరాజు ఉరిశిక్షకు సంబంధించిన నోటీసు వచ్చిందని కుటుంబసభ్యులు అంటున్నారు. ఆ తర్వాత తంగరాజు సుప్పయ్యను చివరి చూపు చూసేందుకు ఛాంగి జైలుకు వెళ్లామని, అక్కడ గ్లాస్ విండో మధ్యలోంచి ఆయనను చూశామని చెప్పారు. తనకు అన్యాయం జరిగిందని, అయినా తనకు ఉరి తప్పదని తంగరాజు అనేవారని వారు చెప్పారు. సమాజాన్ని సంరక్షించడానికే తాము మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వారికి కఠిన శిక్షలు విధిస్తున్నామని అధికారులు అంటున్నారు.