దీపావళి రోజున ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించడానికి ముమ్మ‌ర ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

దీపావళి రోజున ఉత్తరకాశీ(Uttarkashi Tunnel Collapse)లోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల(Workers)ను రక్షించడానికి ముమ్మ‌ర ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. సొరంగంలోకి కెమెరా(Camera)ను పంపినట్లు సీఎం ధామీ(Pushkar Singh Dhami) ట్వీట్(Tweet) ద్వారా సమాచారం ఇచ్చారు. ఉత్తరకాశీలోని సిల్క్యారా(Silkyara Tunnel) లో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికుల చిత్రాలు మొదటిసారిగా అందాయి. కార్మిక సోదరులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని.. వారిని త్వరగా సురక్షితంగా బయటకు తీసుకురావడానికి మేము మా శక్తితో ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

సోమవారం కెమెరా ద్వారా కూలీల పరిస్థితిని చూసేందుకు ప్రయత్నించినా.. లోపల దుమ్ము కారణంగా చిత్రాలు స్పష్టంగా తీయలేకపోయారు. దీంతో ఢిల్లీ నుండి ఎండోస్కోపిక్ కెమెరాలు ఆర్డర్ చేశారు. అవి మంగళవారం పైపుల ద్వారా లోప‌లికి పంపారు. దీంతో సొరంగంలో చిక్కుకున్న మొత్తం 41 మంది కూలీలు కెమెరాకు కనిపించారు. అందరూ సురక్షితంగా ఉన్నారు.

ఇండియన్ ఆర్మీ, NDRF, SDRF, BRO, NHIDCL, ఉత్తరాఖండ్ పోలీస్, SJVNL, RVNL, లార్సెన్ & టూబ్రో, THDC, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ONGC, ITBP, స్టేట్ PWD, DRDO, రవాణా మంత్రిత్వ శాఖ, హోంగార్డ్స్ మొదలైన విభాగాలు కార్మికుల‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి.

సొరంగంలో డ్రిల్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం టీహెచ్‌డీసీ నుంచి ఎనిమిది నుంచి 10 మందితో కూడిన బృందం వచ్చింది. రెండు నుంచి రెండున్నర మీటర్ల వ్యాసం కలిగిన సొరంగాన్ని వారు సిద్ధం చేస్తారు. నేటి నుంచి ఆగర్ యంత్రం మళ్లీ వేగంగా పనిచేయడం ప్రారంభించనుంది.

తొమ్మిది రోజులుగా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించే రెస్క్యూ ఆపరేషన్ నేటికీ 10వ రోజు కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం బృందం కొంత‌మేర‌ విజయం సాధించింది. ఆరు అంగుళాల పైపు ద్వారా ఆహారాన్ని కార్మికులకు పంపింది. సాయంత్రం తినడానికి ఖిచ్డీతో పాటు మొబైల్ ఫోన్‌లను ఛార్జింగ్ చేయడానికి ఛార్జర్‌లను పైపు ద్వారా పంపారు.

Updated On 20 Nov 2023 10:42 PM GMT
Yagnik

Yagnik

Next Story