ఎనిమిదో దశకంలో కిస్సా కుర్సీ కా అనే సినిమా వచ్చింది. ఎమర్జెన్సీ కాలంలో నిషేధానికి గురైన ఆ సినిమా జనతాపార్టీ పాలనలో వెలుగు చూసింది. కిస్సా కుర్సీ కా అంటే కుర్చీ కథ! నిజంగానే ప్రతీ కుర్చీకి ఓ కథ ఉంటుంది. దాని మీద వ్యామోహం ఉంటుంది. దానిపైన అధిరోహించాలనే కోరికా ఉంటుంది. ఆ కుర్చీ బలమైనది అయితే మరింత మోహం ఉంటుంది..

ఎనిమిదో దశకంలో కిస్సా కుర్సీ కా అనే సినిమా వచ్చింది. ఎమర్జెన్సీ కాలంలో నిషేధానికి గురైన ఆ సినిమా జనతాపార్టీ పాలనలో వెలుగు చూసింది. కిస్సా కుర్సీ కా అంటే కుర్చీ కథ! నిజంగానే ప్రతీ కుర్చీకి ఓ కథ ఉంటుంది. దాని మీద వ్యామోహం ఉంటుంది. దానిపైన అధిరోహించాలనే కోరికా ఉంటుంది. ఆ కుర్చీ బలమైనది అయితే మరింత మోహం ఉంటుంది..

ఇప్పుడు కర్ణాటకలో(Karnataka) ఇద్దరు బలమైన నేతలు ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీ మీద మనసు పడ్డారు. ఇద్దరూ ఇద్దరే! ఎవరినీ తక్కువ చేయడానికి లేదు. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయంలో ఈ ఇద్దరి పరిశ్రమ ఉంది. వారే సిద్దరామయ్య(Siddaramaiah), డీకే శివకుమార్‌లు(DK Shivakummar)! ముఖ్యమంత్రి ఎంపిక కోసం అత్యంత కీలకమైన సీఎల్పీ సమావేశం జరిగినా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఓ నిర్ణయానికి రాలేకపోయారు.

పార్టీ సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ సీఎల్పీ ఏకవాక్యంతో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని సిద్ధరామయ్యే ప్రతిపాదించారు. పార్టీని విజయతీరానికి చేర్చిన కాంగ్రెస్‌ అగ్రనేతలకు, ప్రజలకు మరో తీర్మానంలో ధన్యవాదాలు తెలిపారు. దానిని శివకుమార్‌ ప్రతిపాదించారు.

సీఎం రేసులో ఉన్న ఈ ఇద్దరు నేతలు ఎవరికివారుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బెంగళూరులోని సిద్ధరామయ్య ఇంటి ముందు రాత్రికి రాత్రే పోస్టర్లు, కటౌట్లు వెలిశాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటూ అభిమానులు పెట్టిన పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇదే విధంగా డీకే శివకుమార్‌ ఇంటి ముందు కూడా ఇలాంటి పోస్టర్లనే పెట్టారు. అయిదేళ్ల పాటు పడిన కష్టానికి ఫలితం దక్కుతుందన్న ఆశాభావాన్ని శివకుమార్‌ వ్యక్తం చేశారంటే ఆయన సీఎం పదవిని ఆశిస్తున్నారనే అర్థం చేసుకోవాలి.

పైగా హైకమాండ్‌ ఎలా చెబితే అలానే అంటున్నారు కానీ లోలోపల మాత్రం సీఎం సీటుపై ఎంత ఇచ్ఛ ఉందో తెలిసిపోతోంది. అయిదేళ్లపార్టీ పార్టీ భారాన్ని తనపైన వేసుకుని, అనేక కష్టనష్టాలను అనుభవించి, కేంద్రప్రభుత్వం దాష్టికాలను భరించిన డీకే శివకుమార్‌ మనో వాంఛను హైకమాండ్‌ తీరుస్తుందా? లేక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే కుర్చీని అప్పగిస్తుందా? అన్నది ఇంకా సందిగ్ధంగానే ఉంది.

Updated On 15 May 2023 6:37 AM GMT
Ehatv

Ehatv

Next Story