నాలుగు రోజుల సస్పెన్స్‌కు తెరపడింది. కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రి(Cheif Minister) ఎవరనేది తేలిపోయింది. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత సిద్ధ రామయ్యనే(Siddharamaiah) సీఎంగా చేయాలనుకుంది కాంగ్రెస్‌(congress) అధిష్టానం.

నాలుగు రోజుల సస్పెన్స్‌కు తెరపడింది. కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రి(Cheif Minister) ఎవరనేది తేలిపోయింది. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత సిద్ధ రామయ్యనే(Siddharamaiah) సీఎంగా చేయాలనుకుంది కాంగ్రెస్‌(congress) అధిష్టానం. ప్రభుత్వ ఏర్పాటుపై పార్ట అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్‌గాధీ(Rahul Gandhi ), ప్రియాంక గాంధీలు(Priyanka gandhi) ఏకాభిప్రాయానికి వచ్చారట. ముఖ్యమంత్రి పీఠంపై పట్టుబట్టిన డీకే శివకుమార్‌ కాసింత తగ్గారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించారు.

నిన్నంతా ఢిల్లీలో పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు(DK Shiva kummar) చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటారని మొదట వార్తలు వచ్చాయి. తర్వాత సిద్ధరామయ్యే పూర్తి కాలం పదవిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. నేషనల్ మీడియా అంతా ఈ వార్తనే పదే పదే ప్రసారం చేశాయి. చివరికి ఏఐసీసీ కర్ణాటక ఇన్‌ఛార్జ్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలాతో పాటు డీకే శివకుమార్‌ కూడా వీటిని ఖండించడంతో న్యూస్‌ ఛానెళ్లు ఈ రకమైన ప్రచారాలకు బ్రేక్‌ వేశాయి. తెల్లవారే వరకు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం చర్చలు జరుపుతూనే ఉంది. మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్యలతో సోనియాగాంధీ చర్చలు జరిపారు. ఖర్గే, సోనియా, రాహుల్‌లతో సమావేశమైన తర్వాత డీకే మనసు మార్చుకున్నారు.

రాజీ ఫార్ములాకు అంగీకరించారు. మరోవైపు నేడు రాత్రి 7 గంటలకు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ గవర్నర్‌ను కలవనున్నారు. 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. శనివారం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. అగ్రనేతలను ఆహ్వానించడం ద్వారా ప్రతిపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

Updated On 17 May 2023 11:21 PM GMT
Ehatv

Ehatv

Next Story