లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న అస్సాం(assam) మహిళా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(Inspector) జున్ముణి రాభా(Junmuni Rabha) కేసులో మరో మలుపు తిరిగింది. పోస్ట్‌మార్టం రిపోర్టులో కొత్త విషయం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయినట్టు నిన్నటి వరకు అనుకున్నారు. అయితే జున్ముణి రాభా శరీరంపై వెనుక(Back) భాగంలో అనేక గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది.

లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న అస్సాం(assam) మహిళా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(Inspector) జున్ముణి రాభా(Junmuni Rabha) కేసులో మరో మలుపు తిరిగింది. పోస్ట్‌మార్టం రిపోర్టులో కొత్త విషయం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయినట్టు నిన్నటి వరకు అనుకున్నారు. అయితే జున్ముణి రాభా శరీరంపై వెనుక(Back) భాగంలో అనేక గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. అలాగే అనేక పక్కటెముకలకు ఫ్రాక్చర్‌(Fracture) అయిందని వైద్యులు గుర్తించారు. బ్రెయిన్‌ హెమరేజ్‌(Brain hemorrhage), కార్డియాక్‌ అరెస్ట్(Cardiac Arrest) కారణంగా జున్ముణి మరణించారని నివేదిక చెబుతోంది. ఆమె రెండు మోకాళ్లు(Knees), కాళ్లు(Foot), మోచేతి(Elbow), చేతుల(Hands)పై గాయాల గుర్తులు ఉన్నాయని పోస్ట్‌మార్టం తేలింది.
మోరికోలాంగ్‌ పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రాభా మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న విషయం తెలిసిందే! జున్ముణి సివిల్‌ దుస్తుల్లో ఒంటరిగా తన ప్రైవేటు కారులో వెళుతున్నప్పుడు నాగోన్‌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఇది ప్రమాదం కాదని, హత్యేనని జున్ముణి కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీ ప్లాన్‌తోనే తమ కూతురును హత్య చేశారని జున్ముణి రాభా తల్లి సుమిత్రా రాభా ఆరోపిస్తున్నారు.

ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ప్రణబ్‌దాస్‌ అనే వ్యక్తిని సీన్‌ రీక్రియేట్‌ కోసం కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలీసులు గౌహతి నుంచి నాగోన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు తాను గౌహతి నుంచి వస్తున్నట్టు ప్రణబ్‌దాస్‌ చెప్పారు. రోడ్డుకు ఎడమపక్కన కారు పార్క్‌ చేసి ఉందని, ఇంతలో ఓ ట్రక్కు ఎదురుగా స్పీడ్‌గా వచ్చి కారును ఢీకొట్టిందని దాస్‌ చెప్పాడు. ప్రమాదం జరగడానికి కొద్ది సేపటి ముందు బ్లాక్‌ జీన్స్‌ ధరించిన ఓ వ్యక్తి కారు దిగి వెళ్లిపోయినట్టు తెలిపాడు. ప్రమాదం జరిగిన తర్వాత కాసేపు తాను అక్కడ ఉన్నానని, పోలీసులు తనను అక్కడ్నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారని దాస్‌ చెప్పారు. ఇదిలా ఉంటే జున్ముణి కేసులో ప్రధాన నిందితుడైన ట్రక్కు డ్రైవర్‌ సుమిత్‌ కుమార్‌ మొన్నటి వరకు పరారీలో ఉన్నారు. గురువారం అస్సాం పోలీసుల ముందు లొంగిపోయారు. ఇదిలా ఉంటే జున్మోణి మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వాశర్మ స్పందించారు. మృతురాలి కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తే కేసును సీబీఐకి అప్పగించడానికి తాను రెడీగా ఉన్నానని చెప్పారు.

జున్మోణి రాభా లేడి సింగంగా పేరు తెచ్చుకున్నారు. ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్నాడంటూ కాబోయే భర్తనే అరెస్ట్‌ చేసిన ఆమెను అప్పుడందరూ ప్రశంసించారు. నేరస్తుల పాలిటి సింహస్వప్నమైన ఆమెను దబాంగ్‌ కాప్‌ అనేవారు. తర్వాత ఆమెను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని జన్ముణిపై అభియోగాలు వచ్చాయి. దాంతో కాబోయే భర్తతో పాటు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. విధుల నుంచి సస్పెండ్‌ కూడా చేశారు. తర్వాత సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో తిరిగి డ్యూటీలో జాయిన్‌ అయ్యారు. లాస్టియర్‌ జనవరిలో భుయాన్‌ నియోజకవర్గంలో చట్ట విరుద్ధంగా అమర్చిన యంత్రాలతో బోట్లను నడుపుతున్నారంటూ కొందరు బోట్‌మెన్‌లను జున్ముణి అరెస్ట్‌ చేశారు. ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడీయో టేప్‌ లీక్‌ కావడం అప్పట్లో వివాదాస్పదమయ్యింది.

Updated On 19 May 2023 5:41 AM GMT
Ehatv

Ehatv

Next Story