మైనర్(Minor) మనవరాలిపై అత్యాచారం చేసిన ఆరోపణలపై అస్సాంలోని హైలకండి(Hailakandi) జిల్లాలో 72 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి కుమారుడు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
మైనర్(Minor) మనవరాలిపై అత్యాచారం చేసిన ఆరోపణలపై అస్సాంలోని హైలకండి(Hailakandi) జిల్లాలో 72 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి కుమారుడు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తల్లిదండ్రులు లేని సమయంలో నిందితుడు.. తన 13 ఏళ్ల మనవరాలిపై పదే పదే లైంగిక(Raped) వేధింపులకు పాల్పడినట్లు.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించగా.. లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారించారు. బాధిత బాలిక వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాత.. మేము నిందితుడిని అదుపులోకి తీసుకున్నాము. మరింత క్షుణ్ణంగా దర్యాప్తు ప్రారంభించామని హైలకండి సదర్ పోలీస్ స్టేషన్ అధికారి విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని హైలకండి డీఎస్పీ లీనా డోలీ తెలిపారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరిచి.. రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించినట్లు వెల్లడించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.