అయోధ్య(Ayodhya)లో రామమందిరం(Rama temple) నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరం ప్రాణ పతిష్ట జరగనుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు చాలా మంది భక్తులు ఆరాటపడుతున్నారు. కానీ కొందరికే ఆ అదృష్టం దక్కనుంది. వచ్చేవారికి వసతీ సదుపాయాలు కలిగించే పరిస్థితిలో అయోధ్య ట్రస్ట్ లేదు.
అయోధ్య(Ayodhya)లో రామమందిరం(Rama temple) నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరం ప్రాణ పతిష్ట జరగనుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు చాలా మంది భక్తులు ఆరాటపడుతున్నారు. కానీ కొందరికే ఆ అదృష్టం దక్కనుంది. వచ్చేవారికి వసతీ సదుపాయాలు కలిగించే పరిస్థితిలో అయోధ్య ట్రస్ట్ లేదు. ఈ కార్యక్రమానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు రావద్దని స్వయంగా శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టే విజ్ఞప్తి చేసింది. వారందరికీ తాము తగిన ఏర్పాట్లు చేయలేమని చెప్పింది. స్థానిక అధికార యంత్రాంగం కూడా ప్రొటోకాల్ పాటించే పరిస్థితి లేదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. జనవరి 26 తరవాత దేశం నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అయోధ్యకు రావచ్చను అని అన్నారు. వారంతా రామ్‌లాలాకు పూజలు చేసుకోవచ్చని తెలిపారు. శీతాకాలంలో వచ్చే ఇబ్బందులను దక్షిణ భారత యాత్రికులు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులను వివిధ సమయాల్లో ఆహ్వానించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చంపత్ రాయ్ వెల్లడించారు. అలా వచ్చే వారికి వసతి, ఆహార సదుపాయాల ఏర్పాట్లను చేస్తామన్నారు.