Shreyas Reddy Death : అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు
అమెరికాలో(America) భారతీయ విద్యార్థుల(Indian Students) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన వారు వరుసగా చనిపోతున్నారు. వారం రోజుల్లోనే నలుగురు విద్యార్థులు చనిపోవడం విషాదం. లేటెస్ట్‌గా మరో విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి(Shreyas Reddy) చనిపోయాడు. ఒహియోలోని(Ohio) సిన్సినాటిలో శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి శవమై కనిపించాడు. ఇతడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలో(America) భారతీయ విద్యార్థుల(Indian Students) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన వారు వరుసగా చనిపోతున్నారు. వారం రోజుల్లోనే నలుగురు విద్యార్థులు చనిపోవడం విషాదం. లేటెస్ట్‌గా మరో విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి(Shreyas Reddy) చనిపోయాడు. ఒహియోలోని(Ohio) సిన్సినాటిలో శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి శవమై కనిపించాడు. ఇతడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో(Linder school Of business) చదువుతున్న శ్రేయాస్‌రెడ్డి మృతిపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం సానుభూతి, సంతాపం తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపింది. ఈ మధ్యనే పాతికేళ్ల వివేక్ సైనీ(Vivek Saini) అనే విద్యార్థిని దుకాణంలో కొట్టి చంపాడో వ్యక్తి. సైనీ ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ షాపులో ఉద్యోగం చేస్తున్నాడు. మాదకద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్క్‌నర్ అనే నిరాశ్రయునికి వివేక్ ఆశ్రయమిచ్చాడు. అందుకు కృతజ్ఞత చూపాల్సిందిపోయి వివేక్‌ను కొట్టి చంపాడు ఫాల్క్‌నర్. అంతకు ముందు ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న నీల్ ఆచార్య అనే భారతీయ విద్యార్థి కూడా శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజీ ఆఫ్ ఫర్డ్యూ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్న ఆచార్య గత ఆదివారం కనిపించకుండాపోయాడు. సోషల్ మీడియాలో అతడి ఫ్రెండ్స్ ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. మరుసటి రోజే ఆచార్య చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఆదిత్య అద్లాఖా అనే 26 ఏళ్ల విద్యార్థి కూడా హత్యకు గురయ్యాడు. సిన్సినాటి యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆదిత్యను ఒహియోలోని కారులో దుండగులు కాల్చిచంపారు. మరో ఘటనలో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న 18 ఏళ్ల అకుల్ ధావన్ అనే విద్యార్థి కూడా మృతి చెందాడు. మొత్తంగా భారతీయ విద్యార్థుల వరుస మరణాలు కలవరపెడుతున్నాయి.