పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నాయకుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నాయకుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. సుఖ్‌బీదర్‌ సింగ్‌ బాదల్‌ సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. శిక్షలో భాగంగా ఆయన స్వర్ణ దేవాలయ (Golden Temple) ప్రవేశద్వారం దగ్గర వీల్‌ ఛైర్‌లో కూర్చుని సేవాదార్‌గా ఉన్నారు. ఇంతలో ఓ వృద్ధుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అడుగుల దూరంలో నిల్చుని ప్యాంట్‌ జేబులోంచి తుపాకీ తీసి సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత సిబ్బంది వృద్ధుడిని అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు. దాంతో ప్రమాదం తప్పింది. తర్వాత ఆ వృద్ధుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని నరైన్‌ సింగ్‌ చౌరాగా గుర్తించారు. గతంలో ఇతడు బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ అనే ఉగ్రవాద సంస్థలో పని చేశాడట! 1984లో నరైన్‌ సింగ్ సరిహద్దులు దాటి పాకిస్థాన్‌ వెళ్లినట్లు ఇంగ్లీష్‌ మీడియా అంటోంది. పంజాబ్‌లోకి అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాల రవాణాలో ఇతడు కీలకంగా వ్యవహరించారట! ఆ తర్వాత కొంతకాలానికి భారత్‌ తిరిగొచ్చిన నరైన్‌ సింగ్‌ చౌరాను పంజాబ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల పాటు జైలుశిక్ష కూడా అనుభవించాడు. శిరోమణి అకాలీదళ్ పార్టీ (Shiromani Akali Dal) అధికారంలో ఉన్న సమయంలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ (Sukhbir Singh Badal) మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్‌ నిర్ధారించింది. చీఫ్‌ సుఖ్‌బీర్‌ను దోషిగా తేల్చింది. సేవకుడిగా అమృత్‌సర్‌ (Amritsar)లోని స్వర్ణదేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్‌గా ఉన్న సుఖ్‌బీర్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పింది. ఆరు నెలలలోపు పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తెలిపింది. దంతో సుఖ్‌బీర్‌ మంగళవారం నుంచి ఈ శిక్షను అనుభవిస్తున్నారు. చేసిన తప్పులను అంగీకరిస్తున్నట్టుగా రాసిన ఉన్న బోర్డును మెడలో వేసుకున్నారు.

ehatv

ehatv

Next Story