ఆడపిల్లను పెంచుకోవ‌డానికి దత్తత తీసుకున్న ఓ ఇంట్లో ఆ బాలిక‌ గౌర‌వం మసకబారిపోయింది. తనను పెంచి పోషిస్తున్న మహిళ కొడుకు బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఆ బాలిక‌పై ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. ఫ‌లితం 16 సంవత్సరాల వయస్సులోనే బాలిక గర్భవతి అయ్యింది. ప్రసవించిన తర్వాత బిడ్డను చంపాలని ప్లాన్ చేశాడు ఆ దుర్మార్గుడు. అది విఫలమ‌వ‌డంతో బిడ్డను విక్రయించాడు. ఈ కేసులో అత్యాచారానికి పాల్పడిన యువకుడితో సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.

ఓ అమ్మాయికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో పక్కనే ఉన్న ఓ మహిళ సానుభూతిపరురాలిగా వచ్చి.. బిడ్డను పెంచి, విద్యా బుద్ధులు నేర్పిస్తానని, తన కలలను సాకారం చేస్తానని చెప్పి త‌న ఇంటికి తీసుకెళ్లింది. అది కుదరలేదు. ఆశ్రయం పొందుతున్న ఇంట్లో ఆ మహిళ కొడుకు ఆమెను తప్పుగా చూడ‌టం ప్రారంభించాడు.

16 ఏళ్ల వయసులో ఒకరోజు స్నానం చేస్తుండగా రహస్యంగా ఆమెను వీడియో తీశాడు. ఆ వీడియోను ఇంటర్నెట్ లో ప్రసారం చేస్తానని బెదిరిస్తూ.. బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. మార్చి 2023లో విక్రమ్ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న ఒక ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో బిడ్డ జన్మించింది.

అత్యాచార నిందితుడు అక్షయ్ బాబు చిన్నారిని అడ్డుతొల‌గించేందుకు ప్ర‌య‌త్నాలు చేశాడు. కానీ.. మ‌న‌సు మార్చుకున్నాడు. మూడు నెలల తర్వాత చిన్నారిని ఓ వ్యక్తికి విక్రయించాడు.

చిన్నారిని అడిగేందుకు బాలిక‌ వెళ్లగా క‌రెంట్ షాక్ పెట్టి చిత్రహింసలకు గురి చేశాడు. అంతే కాదు.. ఇంత జరిగిన తర్వాత మళ్లీ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. దీంతో బాలిక సోదరి స‌హాయంతో మొత్తం విషయాన్ని ఎస్పీకి వివ‌రించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి నగర్‌ కొత్వాలిలో తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేశారు.

అక్షయ్ బాబు, అతని తల్లి అక్తరీ బేగం, అతని తండ్రి రషీద్, బిస్మిల్లా నర్సింగ్ హోమ్ డైరెక్టర్, ఆపరేటర్, ఛోటే బాబు, షెబా, అబ్బాస్, నహిద్‌లపై కేసు నమోదు చేసినట్లు సిటీ కొత్వాల్ సత్యేంద్ర సింగ్ తెలిపారు. లోతైన విచారణ జరుగుతోంది. త్వరలో మిగిలిన‌ నిందితులను పట్టుకుంటామన్నారు.

Updated On 27 Jun 2023 5:45 AM GMT
Ehatv

Ehatv

Next Story