చికోటి ప్రవీణ్‌(Chikoti Praveen) చీకటి లీలలు అన్నీ ఇన్నీ కావు. థాయ్‌లాండ్‌(Thailand)లో క్యాసినో(Casino) నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోయిన అతగాడు మామూలోడు కాదు. గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉన్న దేశంలోనే క్యాసినో నిర్వహిస్తున్నడంటే అతడెంతటి ఘటికుడో అర్థమవుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న థాయ్‌లాండ్‌ పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు తెలుస్తున్నాయి.

చికోటి ప్రవీణ్‌(Chikoti Praveen) చీకటి లీలలు అన్నీ ఇన్నీ కావు. థాయ్‌లాండ్‌(Thailand)లో క్యాసినో(Casino) నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోయిన అతగాడు మామూలోడు కాదు. గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉన్న దేశంలోనే క్యాసినో నిర్వహిస్తున్నడంటే అతడెంతటి ఘటికుడో అర్థమవుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న థాయ్‌లాండ్‌ పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు తెలుస్తున్నాయి.

థాయ్‌లాండ్‌ చోనుబురి జిల్లా బాంగ్‌ లమంగ్‌లోని ఇసియా పట్టాయా హోటల్‌ దగ్గర పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతోందని థాయ్‌ పోలీసులకు గోవా నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి చెప్పాడు. ఫోన్‌ కాల్‌ ఆధారంగా రైడ్‌ నిర్వహించారు థాయ్‌ పోలీసులు. పోలీసులు రావడంతోనే అక్కడున్నవారు తలో దిక్కుగా పరుగులు తీశారు. అయితే పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ఎవరూ వారి నుంచి తప్పించుకోలేకపోయారు. ముఠాలోని 93 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠాకు బాస్‌ ఎవరయ్యా అంటే మన చికోటి ప్రవీణే! మొత్తం 93 మందిలో 80 మంది భారతీయులేనట! వారందరినీ థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లింది కూడా ప్రవీణేనట! అరెస్ట్‌ అయిన వారిలో హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, పెద్ద పదవుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ నేత చిట్టి దేవేందర్‌రెడ్డి, ఇసుక వ్యాపారి సాగర్‌, గాజులరామారం వీఆర్‌ఏ వాసు కూడా అరెస్ట్‌ అయిన వాళ్లలో ఉన్నాడు. గత నెల 27వ తేదీన వాసు థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. అప్పట్నుంచి క్యాసినో ఆడుతూనే ఉన్నాడు. అనుమతి లేకుండా థాయ్‌లాండ్‌కు వెళ్లిన వాసును తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్టు కలెక్టర్‌ ప్రకటించారు. వాసుతో పాటు థాయ్‌లాండ్‌ వెళ్లిన వర్మ, యాన్‌సాగర్‌లను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

క్యాసినోకు ఫైనాన్స్‌ చేసిన వినోద్‌రెడ్డి, చికోటి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, తిరుమలరావు, బిల్డర్‌ మధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఓ ప్రముఖ ట్రావెల్స్‌ ఓనర్‌ను కూడా ఉన్నాడట! ఈ గ్యాంబ్లింగ్‌ వ్యవహారంలో చికోటికి సితార్నన్‌ కెల్వెల్కర్‌ అనే ఓ మహిళ సహకారం అందించిందని పోలీసులు చెబుతున్నారు. గ్యాంబ్లింగ్‌ నిర్వహణ కోసం అక్రమంగా థాయ్‌లాండ్‌కు చేరిన వలస కార్మికులను కూడా చికోటి ఉపయోగించినట్లు తెలిసింది. గ్యాంబ్లింగ్‌ అడ్డాపై దాడి చేసి పోలీసులు 20 కోట్ల రూపాయల విలువ చేసే ఇండియన్‌ కరెన్సీని, కోట్లు విలువ చేసే గేమింగ్‌ చిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆట ఆడేందుకు ఒక్కోక్కరి దగ్గర నుంచి 50 వేల బాట్స్‌ను చికోటి వసూలు చేశాడట. మన కరెన్సీలో చెప్పాలంటే లక్షా 20 వేల రూపాయలన్నమాట. హోటల్‌ కన్వెన్షన్‌ హాల్‌ను చికోటి క్యాసినోగా మార్చేశాడట. అక్కడి గేమింగ్‌ను సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్‌కు లైవ్‌ రికార్డింగ్‌ కనెక్ట్‌ చేశాడట! ఇవన్నీ చూసి థాయ్‌లాండ్‌ పోలీసులు బిత్తరపోయారట. ఇప్పటికే ఈడీ నుంచి ఫెమా దర్యాప్తును చికోటి ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే!

Updated On 2 May 2023 2:09 AM GMT
Ehatv

Ehatv

Next Story