సాధారణంగా వివాహం జరిగిన తర్వాత శోభనం జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది.
సాధారణంగా వివాహం జరిగిన తర్వాత శోభనం జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. శోభనం రోజు పడకగదిని పూలతో అలంకరిస్తారు. అగరబత్తీలు, స్వీట్లు, పండ్లు పెట్టి, బెడ్‌ను ఆకర్షణీయంగా తయారు చేయడం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. గదిలో సువాసనభరితంగా ఉండేలా చూస్తారు. అయితే ఓ జంటకు పెళ్లయిన తర్వాత నాలుగో రోజు శోభనం కోసం ఏర్పాట్లు చేశారు. తీరా గదిలోకి వెళ్లిన తర్వాత భార్య 'కోరికల' చిట్టా విని ఏకంగా భర్త విడాకుల కోసం పట్టుబట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ నైట్ రోజు వధువు కోరిన కోరికలకు బిత్తరపోవడం భర్త వంతయింది. శోభనానికి ముందు తనకు బీరు, గంజాయి కావాలని భార్య అడగడంతో భర్తకు ఆగ్రహం తెప్పించింది. వధువు అడిగిన కోరికలను కుటుంబసభ్యులకు చెప్పి తనకు ఆమెతో పెళ్లి వద్దని పట్టుబట్టాడు. ఈ విషయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకొని ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. కుటుంబసభ్యులు, వధువు తరపు బంధువులు రెండు, మూడు సార్లు కూర్చొని మాట్లాడేందుకు ప్రయత్నించినా వరుడు ఆమెను భార్యగా అంగీకరించలేదు. తనకు విడాకులు ఇప్పించాలని మంకు పట్టుపట్టుకొని కూర్చున్నాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి నెట్టింట్లో పడి వైరల్‌గా మారింది.