ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు మధ్యప్రదేశ్‌లో వాతావరణం హీటెక్కింది. కాంగ్రెస్ నేత ప్రధాని తండ్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధాని పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అరుణ్ యాదవ్ మాట్లాడుతూ.. “ప్రధాని తండ్రి కూడా రాష్ట్రానికి రావచ్చు. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.

Shivraj Singh Chouhan on Congress leader’s remark on PM Modi’s father
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పర్యటనకు ముందు మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో వాతావరణం హీటెక్కింది. కాంగ్రెస్ నేత ప్రధాని తండ్రి(PM Modi Father)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధాని పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అరుణ్ యాదవ్(Arun Yadav) మాట్లాడుతూ.. “ప్రధాని తండ్రి కూడా రాష్ట్రానికి రావచ్చు. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అరుణ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా రాష్ట్రాన్ని సందర్శించవచ్చు. జేపీ నడ్డా(JP Nadda) ఇప్పటికే రాష్ట్ర పర్యటనకు వచ్చారు. మోదీజీ తండ్రి సందర్శించాలనుకున్నా.. రావచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు’ అని అన్నారు.
అరుణ్ యాదవ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) కాంగ్రెస్(Congress)పై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు "కాంగ్రెస్ సంస్కృతి" కి నిదర్శనం అని అన్నారు. “గౌరవనీయులైన ప్రధానమంత్రి దివంగత తండ్రిపై కాంగ్రెస్ నాయకుడు అరుణ్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన స్థాయి లేని మనస్తత్వానికి ప్రతీక అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మోదీ జీ దేశానికి గర్వకారణం, దేశప్రజల ఆత్మగౌరవం. దేశంలో విశేష ప్రజాదరణ పొందిన ప్రధానమంత్రి(Prime Minister)తో నేరుగా పోటీ పడలేక.. కాంగ్రెస్ ఇలాంటి అసభ్యకరమైన, అసభ్య పదజాలాన్ని ఆశ్రయించిందని ముఖ్యమంత్రి అన్నారు. అరుణ్ యాదవ్ చేసిన ప్రకటన మధ్యప్రదేశ్ కు సిగ్గుచేట(Ashamed)ని శివరాజ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ నిరాశకు రాష్ట్ర ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. ప్రధాని మోదీ జూన్ 27న భోపాల్(Bhopal)లో పర్యటించనున్నారు.
