విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను(Corona Virus) కట్టడి చేయడానికే సతమతమవుతుంటే కొత్తగా హిమాచల్‌ప్రదేశ్‌లో(Himachal Pradesh) అరుదైన లైమ్‌ వ్యాధి(Lyme disease) భయపెడుతోంది. సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీకి(Indra gandhi medical college) చెందిన నిపుణులు 144 మందికి ఈ వ్యాధి సోకినట్టు కనుగొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రాజెక్ట్ భాగంగా 232 మంది వ్యక్తుల నమూనాలను సేకరిస్తే అందులో 144 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరి నమూనాలను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు(AIMS) పంపించారు.

రిపోర్టులు వస్తే కానీ ఎంతమందికి లైమ్ వ్యాధి సోకిందో తెలియదు. గత ఏడాది 173 నమూనాలు సేకరించారు. లైమ్‌ వ్యాధి బొర్రేలియా బర్గ్‌డోర్పెరి సెన్స్‌లాటో అనే చిన్న బాక్టీరియల్‌ స్పిరొచెట్‌తో సోకుతుంది. ఐక్సోడ్స్ జాతి కీటకాల కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మే నుంచి సెప్టెంబర్‌ మధ్య వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్నపాటి క్రిములు అడవులు, వాటి పరిసర ప్రాంతాలలోనే ఎక్కువగా కనిపిస్తాయి. జంతువులకు అంటుకుని రక్తాన్ని పీల్చేస్తాయి. పేలులాగే ఉండే ఈ క్రిములు ఎలుకలు, ఎద్దులు, ఆవులు, కొన్ని జాతుల పక్షులలో కనిపిస్తాయి. అమెరికా, ఐరోపా దేశాలలో ఈ వైరల్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మొదటి దశలో పేలు కుట్టిన ప్రాంతంల దద్దుర్లు వస్తాయి. ఆ తర్వాత జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట ఉంటాయి. మూడు నుంచి పది వారాల మధ్య రెండో దశ మొదలవుతుంది. మెడలో నొప్పి, రెండు వైపులా కండరాలు బలహీనపడటం, గుండె చప్పుడు సక్రమంగా ఉండకపోవడం, వెన్నునొప్పి, కళ్లల్లో నొప్పి వస్తాయి. మూడో దశలో వ్యాధి తీవ్రత భయంకరంగా ఉంటుంది. చూపు పోయే ప్రమాదం కూడా ఉంది.

Updated On 27 Dec 2023 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story