Sheynnis Palacios : నికరాగ్వా భామ షెన్సిస్ పలాసియోస్
ఈ ఏడాది మిస్ యూనివర్స్‌గా(Miss Universe) నికరాగ్వాకు(Nicaragua) చెందిన షెన్నిస్ పలాసియోస్(Sheynnis Palacios) ‘ ఎంపికైంది. ఎల్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో జరిగిన అందాల పోటీలో(Beauty Contest) 72వ ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుని..విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన తుది పోటీల్లో 90 దేశాలకు చెందిన అందెగత్తెలు పాల్గొన్నారు. భారత్ నుంచి 23 ఏళ్ల మిస్ శ్వేతా శార్దా(Shweta Sharda) ప్రాతినిధ్యం వహిచింది.
ఈ ఏడాది మిస్ యూనివర్స్‌గా(Miss Universe) నికరాగ్వాకు(Nicaragua) చెందిన షెన్నిస్ పలాసియోస్(Sheynnis Palacios) ‘ ఎంపికైంది. ఎల్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో జరిగిన అందాల పోటీలో(Beauty Contest) 72వ ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుని..విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన తుది పోటీల్లో 90 దేశాలకు చెందిన అందెగత్తెలు పాల్గొన్నారు. భారత్ నుంచి 23 ఏళ్ల మిస్ శ్వేతా శార్దా(Shweta Sharda) ప్రాతినిధ్యం వహిచింది. అయితే సెమీస్‌లో టాప్-20కు అర్హత సాధించిన శ్వేతా శారదా..టాప్-10లో స్థానం దక్కించుకోలేకపోయింది. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్(R Bonney Gabriel) ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగువా మహిళగా షెన్నిస్ పలాసియోస్ నిలిచింది. ఇక థాయ్ లాండ్ కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్ గా నిలువగా.. అస్ట్రేలియాకు చెందిన మోరయో విల్సన్ రెండో రన్నరప్‌గా నిలిచింది. ఇక మిస్ యూనివర్స్ 2023 ఎంపిక కోసం వివిధ దశల్లో అందగత్తెలు పోటీపడ్డారు. వ్యక్తిగత ప్రకటనలు, ఇంటర్వ్యూలు, ఈవెనింగ్ గౌన్లు, ఈత దుస్తులలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ఫైనల్ పోటీకి జెన్నీ మే జెంకిన్స్, మరియా మెనౌనోస్, మాజీ మిస్ యూనివర్స్ ఒలివియా కల్పో హోస్టులుగా వ్యవహరించారు.
మరోవైపు విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.