దేశ విభజన మనిషి చేసుకున్న అతి పెద్ద విపత్తు. లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఆ దారుణ ఘటనను రెండు దేశాల ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇండియా(India) నుంచి పాకిస్తాన్‌కు(Pakistan), పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు ఎంతో మంది కట్టుబట్టలతో వలసలు వచ్చారు. పాకిస్తాన్‌లో ఉన్న మెజారిటీ హిందువులు భారత్‌కు వచ్చేశారు.

దేశ విభజన మనిషి చేసుకున్న అతి పెద్ద విపత్తు. లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఆ దారుణ ఘటనను రెండు దేశాల ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇండియా(India) నుంచి పాకిస్తాన్‌కు(Pakistan), పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు ఎంతో మంది కట్టుబట్టలతో వలసలు వచ్చారు. పాకిస్తాన్‌లో ఉన్న మెజారిటీ హిందువులు భారత్‌కు వచ్చేశారు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లో మైనారిటీల సంఖ్య క్రమంక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడక్కడ చాలా మంది హిందువులు దుర్భర జీవితాన్ని గడపుతున్నారు. విభజన సమయంలో అక్కడ ఉన్న అనేక గుళ్లు గోపురాలు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. కొన్ని ఆలయాలను కూల్చేశారు. కొన్నేమో శిథిలావస్థకు చేరుకున్నాయి. సియాల్‌కోట్‌లో(Sialkot) కూడా ఓ అద్భుత ఆలయం(Temple) ఉంది. 72 ఏళ్లుగా అది మూతబడి ఉంది. కొంతకాలం కిందట ఆలయ తలుపులు మళ్లీ తెర్చుకున్నాయి. ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) ప్రదానమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆలయానికి నిధులు కేటాయించారు. ఆలయానికి మరమత్తులు చేయించారు. రాళ్లతో నిర్మించిన ఈ శివాలయం వాస్తు గొప్పగా ఉంటుంది. ఏడు దశాబ్దాలుగా ఆలయం మూసివేసి ఉన్నా గోడలు చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. అంత బలంగా నిర్మించారీ ఆలయాన్ని. ఈ ఆలయం పేరు శివాలతేజ్‌ సింగ్‌ టెంపుల్‌(Shivalatej Singh Temple). 2019లో అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఈ ఆలయాన్ని తెరిచారు. దేవతామూర్తుల విగ్రహాలను తిరిగి ప్రతిష్టించారు. పూజలు మొదలుపెట్టారు. ఆలయం తలుపులు తెరుచుకున్న సమయంలో అక్కడ ఉన్న హిందువులు భావోద్వేగానికి లోనయ్యారు. హర్‌ హర్‌ మహాదేవ్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు చాలా దూరం వరకు ప్రతిధ్వనించాయట!

Updated On 17 Oct 2023 1:25 AM GMT
Ehatv

Ehatv

Next Story