ఉత్తరప్రదేశ్‌లో(UttarPradesh) హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కుక్క(Dog) కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పలేదు. నెలన్నర రోజులు తర్వాత రేబిస్‌ వ్యాధితో(Rabies disease) ఆ పిల్లోడు చనిపోయాడు. తండ్రి భుజాల మీద బాలుడు కన్నుమూయడం కలచివేసింది. విజయనగర్‌ పోలీసుస్టేషన్‌(Vijaynagar Police station) పరిధిలో ఉన్న చరణ్‌సింగ్‌(Charan Singh Colony) కాలనీకి చెందిన షావేజ్‌(shavej) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లో(UttarPradesh) హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కుక్క(Dog) కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పలేదు. నెలన్నర రోజులు తర్వాత రేబిస్‌ వ్యాధితో(Rabies disease) ఆ పిల్లోడు చనిపోయాడు. తండ్రి భుజాల మీద బాలుడు కన్నుమూయడం కలచివేసింది. విజయనగర్‌ పోలీసుస్టేషన్‌(Vijaynagar Police station) పరిధిలో ఉన్న చరణ్‌సింగ్‌(Charan Singh Colony) కాలనీకి చెందిన షావేజ్‌(shavej) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నెలన్నర రోజుల కిందట పక్కింటి వాళ్లకు చెందిన కుక్క షావేజ్‌ను కరిచింది. తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయంతో విషయాన్ని వారికి చెప్పకుండా దాచి పెట్టాడు. ఆ కుక్కకు వ్యాక్సిన్‌ చేయించకపోవడంతో బాలుడికి రేబిస్‌ వ్యాధి సోకింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి బాలుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అన్నం తినడం మానేశాడు. విచిత్రంగా ప్రవర్తించసాగాడు. కుక్కలా మొరగసాగాడు.

ఇది గమనించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీశారు. అప్పుడు కానీ తనను కుక్క కరిచిన సంగతి చెప్పలేదు. వెంటనే బాలుడిని ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసేందుకు నిరాకరించడంతో బులంద్‌షహర్‌లోని ఆయుర్వేద వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడి ఆరోగ్యపరిస్థితి విషమించింది. దాంతో బులంద్‌షహర్‌ నుంచి ఘజియాబాద్‌కు అంబులెన్స్‌లో బయలుదేరారు. దారి మధ్యలోనే షావేజ్‌ తన తండ్రి చేతుల్లోనే ప్రాణాలు విడిచాడు. కొడుకు పరిస్థితి చూసి కుమిలిపోతున్న తండ్రి, తండ్రి చేతిలో నొప్పితో విలవిలలాడుతూ మృత్యువుతో పోరాడుతున్న బాలుడి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ హృదయ విదారక దృశ్యాలు ప్రతీ ఒక్కరిని కదిలించాయి. కలచివేశాయి. షావేజ్‌ మృతికి కారణమైన కుక్కతో పాటు దాని యజమానిపై చర్యలు తీసుకోవాలని షావేజ్‌ కుటుంబం పోలీసులకు కంప్లయింట్‌ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated On 7 Sep 2023 3:33 AM GMT
Ehatv

Ehatv

Next Story