ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(Delhi Excise Policy) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డిని(sharath Chandra) అప్రూవర్‌గా మారేందుకు ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు అనుమతించింది.

BIG Breaking
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(Delhi Excise Policy) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డిని(sharath Chandra) అప్రూవర్‌గా మారేందుకు ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. శరత్ చంద్రారెడ్డి అభ్యర్థన మేరకు కోర్టు గురువారం అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురి పేర్లు మరోసారి తెర మీదకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ కు సంబందించి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC K.Kavitha), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి(MP Srinivas Reddy), ఆయన కుమారుడు రాఘవ రెడ్డి(Raghava Reddy), వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై(Arun Chnadra Pillai), కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి ఉన్నారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ కేసులో కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్‌గా మారగా.. తాజాగా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు.
