☰
✕
కేరళలో అరుదైన సంఘటన..
x
కేరళలో(Kerala) ఓ అరుదైన సంఘటన జరిగింది. అది కూడా అత్యున్నత స్థాయి అధికార యంత్రాంగంలో.. కేరళ చీఫ్ సెక్రటరీ(Chief Secretery) బాధ్యతలను భర్త నుంచి భార్య అందుకుంటున్నారు. ఇది విచిత్రమే! ప్రస్తుతం ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ వీ. వేణు(Dr.V venu) ఆగస్టు 31వ తేదీన రిటైర్ అవుతున్నారు. ఆయన పదవి విరమణ నేపథ్యంలో కొత్త చీఫ్ సెక్రటరీగా ఆయన భార్య శారద మురళీధరన్‌ను(Sharada muralidas) ఎన్‌డీఎఫ్ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఐఏఎస్ దంపతులు వరుసగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నియమితులు కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. బహుశా దేశంలోనే ఇది తొలిసారి కావచ్చు. డాక్టర్ వేణు, శారద మురళీధరన్‌లిద్దరూ 1990 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వారు.
Eha Tv
Next Story