నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ మే 2న అకస్మాత్తుగా రాజీనామాను ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం.. తదుపరి కార్యాచరణ కోసం, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం కమిటీని ఏర్పాటుచేశారు. ఈరోజు ఆ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ విలేకరుల సమావేశం ద్వారా తెలియజేశారు. ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శరద్ పవార్..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ మే 2న అకస్మాత్తుగా రాజీనామాను ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం.. తదుపరి కార్యాచరణ కోసం, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం కమిటీని ఏర్పాటుచేశారు. ఈరోజు ఆ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ విలేకరుల సమావేశం ద్వారా తెలియజేశారు. ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శరద్ పవార్.. తన రాజీనామాను ఉపసంహరించుకున్నారని ప్రఫుల్ పటేల్ ప్రకటించారు.
అనంతరం నేను నా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాను అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. మీడియా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. నేను మీ మనోభావాలను కించపరచలేనని అన్నారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలన్న మీ డిమాండ్‌ను గౌరవిస్తున్నాను. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే నా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాను.
శరద్ పవార్ రాజీనామా ఉపసంహరణ ప్రకటన చేస్తున్న సమయంలో ఆయన వెంట అజిత్ పవార్ లేకపోవడం గమనార్హం. ఈ విషయమై శరద్ పవార్‌ను ప్రశ్నించగా.. అందరూ ఇక్కడే ఉన్నారని అన్నారు. కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. వారి నిర్ణయం తర్వాత, నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. మేమంతా ఐక్యంగా ఉన్నాం. కమిటీలో సీనియర్ నేతలు ఉండి చర్చిస్తున్నారని శరద్ పవార్ తెలిపారు.
అంతకుముందు.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం ముంబైలో జరిగింది. సుప్రియా సూలే, అజిత్ పవార్ సహా పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. శరద్ పవార్ రాజీనామా ప్రతిపాదనను తిరస్కరిస్తూ కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. శరద్ పవార్ పార్టీ పదవిలో కొనసాగాలని కోరుతూ ఎన్సీపీ కోర్ కమిటీ తీర్మానం చేసిందని నేతలు పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని పార్టీ నేత ప్రఫుల్ పటేల్ ప్రవేశపెట్టారు. అనంతరం కోర్ కమిటీ సభ్యులు ముంబైలోని శరద్ పవార్‌ను ఆయన నివాసంలో కలిశారు.