తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) మంగళవారం మహారాష్ట్ర(Maharastra)లోని షోలాపూర్ జిల్లా పండర్‌పూర్‌లోని విఠల్ రుక్మిణి ఆలయంలో పూజలు చేశారు. రాకేసీఆర్‌ ఆషాఢ ఏకాదశికి రెండు రోజుల ముందు ఆలయాన్ని సందర్శించారు. అయితే కేసీఆర్‌ పర్యటనపై మహారాష్ట్ర నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా స్పందించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) మంగళవారం మహారాష్ట్ర(Maharastra)లోని షోలాపూర్ జిల్లా పండర్‌పూర్‌లోని విఠల్ రుక్మిణి ఆలయంలో పూజలు చేశారు. రాకేసీఆర్‌ ఆషాఢ ఏకాదశికి రెండు రోజుల ముందు ఆలయాన్ని సందర్శించారు. అయితే కేసీఆర్‌ పర్యటనపై మహారాష్ట్ర నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ 600 వాహనాల కాన్వాయ్‌తో మహారాష్ట్ర రావ‌డం ప‌ట్ల‌ శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ తొలుత సోమవారం ఆలయాన్ని సందర్శించి అనంతరం అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని సర్కోలి గ్రామంలో రాజకీయ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ని దక్షిణ మహారాష్ట్రలో విస్తరించాలనే ఆలోచనలో ఉన్న కేసీఆర్.. ఈ క్రమంలోనే ఇటువంటి బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పర్యటనపై మీడియా శరద్‌ పవార్‌ను రియాక్షన్‌ అడగగా.. పొరుగు రాష్ట్ర సీఎం రాష్ట్రంలోని ఓ గుడికి వచ్చి పూజలు చేస్తే ఎవరికీ ఇబ్బంది లేదన్నారు. కానీ అదే సీఎం 600 వాహనాల కాన్వాయ్‌తో వస్తే.. వాహనాలతో బ‌లాన్ని ప్రదర్శించే ప్రయత్నం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఒక రాష్ట్రానికి సీఎం అయినందున.. తన తొలి ప్రయత్నం రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత పెంపొందించేలా ఉండాలని కేసీఆర్‌కు సూచించారు. మంగళవారం కేసీఆర్ ర్యాలీలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఎన్‌సీపీకి చెందిన భగీరథ్ బాల్కేపై పవార్ స్పందిస్తూ.. 2019లో భగీరథకు టిక్కెట్ ఇవ్వక‌పోవ‌డం తప్పేనని.. అయితే ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదని పవార్ అన్నారు.

Updated On 28 Jun 2023 5:10 AM GMT
Ehatv

Ehatv

Next Story