నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. కాగా, ఈరోజు ఢిల్లీలో ఎన్సీపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించి శరద్ పవార్ తన సత్తా చాటనున్నారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్సీపీ నేతలు హాజరుకానున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఎన్సీపీ అధినేత ఇప్పటికే త‌న‌ నివాసం నుంచి బయలుదేరారు.

నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP)) నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో కలకలం రేగింది. కాగా, ఈరోజు ఢిల్లీ(Delhi)లో ఎన్సీపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించి శరద్ పవార్ తన సత్తా చాటనున్నారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్సీపీ నేతలు హాజరుకానున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఎన్సీపీ అధినేత ఇప్పటికే త‌న‌ నివాసం నుంచి బయలుదేరారు.

శరద్ పవార్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీల ముఖ్యులు, రాష్ట్ర నేతలు తరలిరానున్నారు. ఈ సమావేశం ద్వారా పార్టీలోని నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పవార్ ప్రయత్నించనున్నారు. శరద్ పవార్ పార్టీ, దాని చిహ్నం(Party Synbol)పై హక్కును కోల్పోకుండా ఉండటానికి కీల‌క చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

సమావేశానికి ముందు ఎన్‌డీఎంసీ(New Delhi Municipal Council) శరద్ పవార్ పోస్టర్లు, హోర్డింగ్‌(Hoardings)లను తొలగించింది. మౌలానా ఆజాద్ రోడ్ సర్కిల్(Maulana Azad Road Circle), జనపథ్ సర్కిల్(Janpath Circle)దగ్గర పోస్టర్ల(Posters)ను తీసివేసి షాకిచ్చింది.

ఎన్సీపీలో చీలిక తర్వాత శరద్ పవార్, అజిత్ పవార్(Ajit Pawar) వర్గం అంతకుముందు రోజు వేర్వేరుగా పార్టీ సమావేశాలు నిర్వహించింది. ఇరువురు నేతల సమావేశానికి పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే మేనల్లుడు అజిత్.. మామ శరద్‌పై విజయం సాధించాడు. అజిత్ వర్గం సమావేశానికి 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలలో 32 మంది హాజరు కాగా, శరద్ పవార్ సమావేశానికి 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు ఏ సమావేశానికి వెళ్ల‌లేదు. ఒక ఎమ్మెల్యే నవాబ్ మాలిక్(Navab Malik) జైల్లో ఉన్నారు. పార్టీ సమావేశంలో అజిత్ పవార్ ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రఫుల్ పటేల్(Praful Patel) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియ‌మించారు. దీనితో పాటు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై కూడా దావా వేశారు.

Updated On 5 July 2023 10:50 PM GMT
Yagnik

Yagnik

Next Story