నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్(Sharad Pawar) తన పార్టీలో అంతర్గత పోరుపై మరోసారి మాట్లాడారు. తమ పార్టీ చీలికను కొట్టిపారేసిన ఆయన.. కొందరు ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన మాట వాస్తవమేనని.. ఎమ్మెల్యేలు వెళ్లిపోతే అది రాజ‌కీయ పార్టీ కాకుండా పోద‌ని అన్నారు. తాను ఎన్‌సీపీ జాతీయ అధ్యక్షుడినని.. జయంత్ పాటిల్ రాష్ట్ర అధ్య‌క్షుడు అని అన్నారు.

తన మెతక వైఖరితో ఎన్సీపీలో చీలిక రాలేదన్నారు. కొందరు ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన మాట వాస్తవమే కానీ.. ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంతో అది రాజకీయ పార్టీ అని చెప్పకతప్పదు. తిరుగుబాటుదారుల పేర్లను ప్ర‌స్తావిస్తూ ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి? అని ప్ర‌శ్నించారు. షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరాలని కొంతమంది ఎమ్మెల్యేలు తనకు లేఖ రాశారని శరద్ పవార్ అంగీకరించారు. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇండియా కూటమి సమావేశం గురించి పవార్ సమాచారం ఇచ్చారు.

బీజేపీ(BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ఫాసిస్టు పోకడలను నేను వ్యతిరేకిస్తూనే ఉంటానని పవార్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేశారని మండిప‌డ్డారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబయిలో జరిగే విపక్ష కూటమి సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహకాల సమీక్షతో పాటు ఉమ్మడి ప్రచారంపైనా చర్చిస్తామని చెప్పారు.

Updated On 26 Aug 2023 6:15 AM GMT
Ehatv

Ehatv

Next Story