గజేంద్ర సిన్హ్ పర్మార్‌పై(Gajendra Singh Parmar) పై లైంగిక దాడి కేసు
గుజరాత్‌లో(Gujarat) అధికార భారతీయ జనతా పార్టీ(BJP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి గజేంద్ర సిన్హ్ పర్మార్‌పై(Gajendra Singh Parmar) పై లైంగిక దాడి కేసు(sexual assault case) నమోదయ్యింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2020 జూలై 30న గాంధీనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్‌కు తనను పిలిపించుకున్నారని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకున్నారని ఓ దళిత మహిళ ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా బదులివ్వడం లేదని ఆమె చెప్పారు. తమ మధ్య ఉన్న సంబంధం గురించి ఎవరికైనా చెబితే కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెడతానంటూ కులం పేరుతో తిట్టారని తెలిపారు. అప్పుడు బాధితురాలు ఇచ్చిన కంప్లయింట్‌ను పోలీసులు పట్టించుకోలేదు. దాంతో ఆమె 2021లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్మార్‌పై వెంటనే అత్యాచారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో గాంధీనగర్ సెక్టార్-21 పోలీస్‌స్టేషన్ పోలీసులు అత్యాచారం, పోక్సో తదితర కేసులు పెట్టారు. ఇప్పటికే పర్మార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. అలాగే రాజస్థాన్‌లో మైనర్ బాలికను అపహరించిన కేసులో రాజేంద్రసిన్హ్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు 2023, ఏప్రిల్‌లో తిరస్కరించింది.