వ్యభిచారం చేయడం నేరం కాదని ముంబై సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే.. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం చేయడం నేరం అని పేర్కొంది. ముంబైలోని సెషన్స్ కోర్టు తీర్పును వెలువరిస్తూ.. వ్యభిచారం నిర్వహిస్తున్న 34 ఏళ్ల మహిళను షెల్టర్ హోమ్ నుండి విడుదల చేయాలని ఆదేశించింది.
వ్యభిచారం(Sex Work) చేయడం నేరం కాదని ముంబై సెషన్స్ కోర్టు(Mumbai Sessions Court) తీర్పు వెలువరించింది. అయితే.. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం(Prostitution) చేయడం నేరం అని పేర్కొంది. ముంబైలోని సెషన్స్ కోర్టు తీర్పును వెలువరిస్తూ.. వ్యభిచారం నిర్వహిస్తున్న 34 ఏళ్ల మహిళను షెల్టర్ హోమ్ నుండి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు(Police) ములుంద్‌లో దాడులు నిర్వహించి.. మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మహిళను ఒక సంవత్సరం పాటు కస్టడీలో ఉంచాలని మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. మేజిస్ట్రేట్ కోర్టును సవాల్ చేస్తూ మహిళ సెషన్స్ కోర్టు(Woman Sessions Court)ను ఆశ్రయించింది.
మేజిస్ట్రేట్ కోర్టు(Magistrate Court) నిర్ణయాన్ని పక్కనపెట్టిన.. సెషన్స్ కోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (Article 19)ని ప్రస్తావించింది. భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛగా తిరగడానికి, నివసించడానికి, స్థిరపడటానికి ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కు ఉందని పేర్కొంది. కేవలం పనిని బట్టి మాత్రమే బాధితురాలిని కస్టడీలో ఉంచడం సరికాదని కోర్టు పేర్కొంది. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సహజంగానే వారికి వారి తల్లి అవసరం. బాధితురాలిని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధిస్తే, అది ఆమె హక్కులకు విరుద్ధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే మార్చి 15, 2023 నాటి ఉత్తర్వును పక్కనబెట్టి, బాధితురాలిని విడుదల చేయాల్సిన అవసరం ఉందని కోర్టు(Court) పేర్కొంది.