రాజస్థాన్‌లోని జైపూర్‌లోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉదయం 7 గంటలకు ఆసుపత్రులకు ఈ-మెయిల్ వచ్చింది,

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉదయం 7 గంటలకు ఆసుపత్రులకు ఈ-మెయిల్ వచ్చింది, దీని తర్వాత తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. బాంబు బెదిరింపు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబు బెదిరింపులు వచ్చిన ఆసుపత్రుల్లో సికె బిర్లా హాస్పిటల్, మోనిలెక్ హాస్పిటల్ ఉన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం.. బాంబు నిర్వీర్య దళం ఆసుపత్రులకు చేరుకున్నాయి. ఆసుపత్రి బెడ్‌ల క్రింద, బాత్‌రూమ్‌లలో బాంబులు ఉంచామ‌ని.. ఈ "ఊచకోత" వెనుక ఉగ్రవాదులు ఉన్న‌ట్లు ఈమెయిల్ బెదిరింపులో ఉంద‌ని PTI పేర్కొంది.

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆంబియన్స్ మాల్‌కు కూడా శనివారం బాంబు బెదిరింపు వచ్చింది. అక్క‌డ ఎంత‌ వెతికినా ఎలాంటి అనుమానాస్పద వస్తువు దొరకలేదు. నవీ ముంబైలోని వాషి ప్రాంతంలోని ఒక ప్రముఖ మాల్‌కు ఈమెయిల్‌లో బాంబు బెదిరింపు రాగా.. అది బూటకమని తేలింది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story