మహారాష్ట్రలో(Maharastra) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం బుల్దానా(Buldana) జిల్లాలో నాగ్‌పూర్-పూణే(Nagpur-pune) హైవేపై బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు.
మహారాష్ట్రలో(Maharastra) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం బుల్దానా(Buldana) జిల్లాలో నాగ్‌పూర్-పూణే(Nagpur-pune) హైవేపై బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు పూణె నుంచి బుల్దానాలోని మెహెకర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీ నేరుగా బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.
మరో రోడ్డు ప్రమాదం సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో దర్యాపూర్-అంజన్‌గావ్ రహదారిపై ఎస్‌యూవీ వాహనం ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కుటుంబ కార్యక్రమంలో పాల్గొని దర్యాపూర్‌కు తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో ఎస్‌యూవీ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఎస్‌యూవీలో ఉన్న ఐదుగురు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దర్యాపూర్ ఆసుపత్రికి తరలించారు.