ఈ రోజుల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. పలు రంగాల్లో పురుషులతో(Men) పోటీ పడడమే కాకుండా మహిళలే(Women) పైచేయి సాధిస్తున్నారు. మహిళల రక్షణ(Women Saftey) కోసం ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా పలు చోట్ల మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక చోట వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల భద్రతపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు అల్లరి మూకలు, అసాంఘిక శక్తులు ఒంటరి మహిళలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. పనిచేస్తున్న ప్రదేశంలో(Working Place), ప్రయాణ సమయాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరికి దగ్గర స్మార్ట్‌ఫోన్(Smart Phone) ఉంది. ఈ క్రమంలో మహిళలు సేఫ్‌గా ఉండాలంటే.. ఈ మొబైల్ యాప్‌ల(Mobile app) గురించి తెలుసుకోవాలి. ఈ యాప్‌ల వల్ల ఎలాంటి పరిస్థితి నుంచైనా బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు.

లైఫ్ 306(Live 306) : ఈ యాప్ మహిళల ఫోన్లలో ఉంటే అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులతో ప్రైవేట్ నెట్‌వర్క్‌ని సృష్టించుకునే అవకాశం ఉంది. ఈ యాప్ రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్‌లతో పాటు ఆటోమేటిక్ క్రాష్ డిటెక్షన్‌లాంటి ఫీచర్లను ఇది అందుబాటులోకి తెచ్చింది.
ఫైట్‌బ్యాక్(Fight Back) : ఈ యాప్ లేడీస్ తమను తాము రక్షించుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ యాప్ స్వీయ-రక్షణ ట్యుటోరియల్స్‌తో పాటు భద్రతా సలహాలను ఇస్తోంది. మీరు ఎక్కడున్నారో కుటుంబసభ్యులు లేదా ఫ్రెండ్స్‌కు తెలియజేసేలా SOS సందేశాన్ని పంపే వీలును కల్పిస్తోంది.
సాస్ స్టే సేఫ్(SOS Stay safe) : మహిళల భద్రతకు ఉపయోగపడే మరో యాప్ ఇది. ఈ యాప్ మీ ఫోన్‌లో ఉంటే కేవలం ఒక ట్యాప్‌తో మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి సాస్(Sos) సందేశాన్ని పంపవచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లో లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలారం ఫీచర్స్ కూడా ఉన్నాయి.
సేఫ్టిపిన్(Saftey Pin) : ఈ యాప్ అర్బన్ ప్రాంతాలలో సురక్షితమైన, అసురక్షిత ప్లేసేస్ గురించి ఇన్ఫర్మేషన్ అందించే క్రౌడ్ సోర్స్ యాప్. అర్బన్ ప్రాంతాల్లో ఉండే పలు ప్రదేశాల గురించి కచ్చితమైన సమాచారం ఇస్తుంది. ట్రాకింగ్ చేసి ఎమర్జెన్సీ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ప్రదేశాలకు భద్రతా రేటింగ్‌ను ఇస్తుంది.
మై సేఫ్టీపాల్(My safteypal) : ఇది మీ ఫోన్‌లో ఉంటే మీ లొకేషన్‌కు సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే మై సేఫ్టీపాల్ యాప్ పలు లొకేషన్‌లలో ఎమర్జెన్సీ హెచ్చరికలు, పానిక్ బటన్, సేఫ్టీ స్కోర్‌లాంటి సౌలభ్యాన్ని కల్పిస్తుంది.
సర్కిల్ ఆఫ్ 6(Circle Of six) : మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు వెంటనే ఆరుగురు ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌ను సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తుంది.
బీసేఫ్(Be Safe) : ఈ యాప్‌లో Sos అలారమ్ సహా చాలా ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఎగ్జాక్ట్ లోకేషన్ వివరాలతో పాటు ఆడియో, వీడియో వివరాలను అందిస్తుంది. ఫోన్ కాల్ మాట్లాడతున్నట్టు మీరు యాక్ట్ చేసేందుకు ఫేక్ కాల్ ఫీచర్ కూడా ఉంది. అలారమ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ యాప్ మీ ఫోన్‌లో ఉంటే ఎప్పటికప్పుడు మీ గార్డియన్‌కు మీ సమాచారాన్ని చేరవేస్తుంది.