ఈ ఏడాది అత్యధికశాతం పెరిగిన స్టాక్ ఏంటో తెలుసా.. ఏకంగా ఎన్ని వేల శాతం పెరిగిందో చూద్దామా..? లక్షల్లో ఆదాయాన్ని పెంచి పెట్టిన స్టాక్ పేరు ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Integrated Industries Limited). 2023 ప్రారంభంలో ఈ స్టాక్ 10 శాతం పడిపోయింది. ఆ తర్వాత ఇస్రో (Isro) ప్రయోగించే రాకెట్‌లో దూసుకెళ్లింది. ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FII) ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టడంతో తిరిగి వెనక్కి చూసుకోలేదు.

ప్రస్తుతం దీని షేర్ విలువ(Share value) రూ.470గా ఉంది.. ఈ ఏడాది ఆరంభంలో దీని విలువ రూ.7 ఉండగా... ఏకంగా 470కి పెరగుతుందని ఎవరూ ఊహించలేదు. 2023లో పెట్టుబడి పెడితే.. దాదాపు 6 వేలకుపైగా శాతం లాభాలతో తన ఇన్వెస్టర్లకు 2024 రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. అంటే 2023 ప్రారంభంలో లక్ష (One lakh) పెట్టుబడి పెడితే.. దాదాపు 61 లక్షల (61 Lakhs) రిటర్న్స్ రావడం విశేషం. దీంతో ఇందులో పెట్టుబడి పెట్టిన వారి ఆనందానికి అవధుల్లేవు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ (PCB) తయారీ చేసే ఈ కంపెనీ హై క్వాలిటీ సింగిల్ సైడెడ్, డబుల్ సైడెడ్ అండ్ మల్టీలేయర్ పీసీబీలను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువ 3.78 బిలియన్లుగా ఉంది.
ఇది ఇలా ఉండగా ఈ ఏడాది భారత మార్కెట్లు మంచి లాభాలను ఆర్జించాయనే చెప్పాలి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన సెన్సెక్స్ (Sensex) 71 వేల రికార్డ్ స్థాయికి చేరుకోగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ (Nifty) 21 వేల మార్కును దాటింది. ఈ ఏడాది ఆరంభంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు తెచ్చిపెట్టాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.