స్టాక్‌మార్కెట్లకు(stock market) నేడు దుర్దినం.
స్టాక్‌మార్కెట్లకు(stock market) నేడు దుర్దినం. ఈరోజు మార్కెట్ కుప్పకూలిపోయింది. ప్రపంచ మార్కెట్లలో క్షీణత వల్లే ఈరోజు భారత్ స్టాక్ మార్కెట్లు(Indian stock market) పతనానికి కారణమంటున్నాయి మార్కెట్ వర్గాలు. అమెరికా మార్కెట్ల(america market) పతనం కారణంగా మన స్టాక్ మార్కెట్ల సూచీలు దిగువకు చూస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్ ఈ వారం మొదటి రోజు భారీ పతనంతో ప్రారంభమైంది. 2,100 పాయింట్లకు పైగా సెన్సెక్స్(Sensex) పడిపోయి 78,770 వద్ద కొనసాగుతోంది. అదేస్థానంలో నిఫ్టీ(Nifty) కూడా 400 పాయింట్లకు పైగా నష్టపోయి 24,300 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో 2.73 శాతం మార్కెట్ కోల్పోగా, నిఫ్టీ 2.71 శాతం షేర్లు కోల్పోయింది. భారీ నష్టాల్లో కొనసాగుతున్న కంపెనీలు: మారుతీ, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, స్టీల్, ఎం అండ్ ఎం, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టైటన్, భారతీ ఎయిర్‌టెల్, టాటా జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్ అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, , బజాజ్ ఫిన్‌సర్వ్