బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ

Senior BJP leader Sushil Kumar Modi dies
బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నారు. "బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ రాజ్యసభ ఎంపీ శ్రీ సుశీల్ కుమార్ మోడీ మరణ వార్తతో బీజేపీ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది" అని ఆ పార్టీ రాష్ట్ర యూనిట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న సుశీల్‌కుమార్ మోదీ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 72 ఏళ్ల సుశీల్‌కుమార్ గత ఆరు నెలలుగా అనారోగ్యంతో ఉన్నారు. ఈ కారణంగా ఆయన లోక్‌సభ ఎన్నికలలో కూడా పార్టీ తరపున ప్రచారం చేయలేదు. ఏప్రిల్ 3న తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సుశీల్ కుమార్ మోదీ మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
సుశీల్ మోదీ సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. భౌతికకాయం మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో పాట్నాలోని రాజేంద్ర నగర్‌లోని ఆయన నివాసానికి చేరుకుంటుంది. సుశీల్ మోదీ గత నెలలోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
