బీజేపీ సీనియ‌ర్ నేత‌, రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు.

బీజేపీ(BJP) సీనియ‌ర్ నేత‌, రాజ్యసభ సభ్యుడు(Rajya Sabha MP) హరద్వార్ దూబే(Hardwar Dubey) ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రి(Fortis Hospital)లో తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు ప్ర‌స్తుతం 73 సంవ‌త్స‌రాలు. దూబే పార్దీవ దేహాన్ని మధ్యాహ్నానానికి ఆగ్రాకు తీసుకురానున్నారు.

ఆదివారం నాడు హరద్వార్ దూబే క్షేమంగా ఉన్నార‌ని ఆయ‌న‌ కుమారుడు ప్రన్షు దూబే(Pranshu Dubey) తెలిపారు. అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ కొంతసేపటికి శ్వాస ఆగిపోయింద‌ని తెలిపారు. కంటోన్మెంట్(Cantonment) నుండి రెండు సార్లు మాజీ ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. రాష్ట్ర మంత్రిగా కూడా ప‌నిచేశారు. హరిద్వార్ దూబే 2020లో రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. హర్‌ద్వార్ దూబేకి కుమారుడు ప్రన్షు దూబే, కోడలు ఊర్వశి(Urvashi), కుమార్తె డాక్టర్ కృత్యా దూబే, అల్లుడు డాక్టర్ శివమ్, మనవడు దివ్యాన్ష్, మనవరాలు దివ్యాన్‌షి ఉన్నారు. ఆయన సోదరుడు గామా దూబే(Gama Dubey) కూడా బీజేపీ సీనియర్ నేత.

Updated On 25 Jun 2023 10:44 PM GMT
Yagnik

Yagnik

Next Story