ప్రియుడు సచిన్ కోసం అష్టకష్టాలు పడి, అడ్డంకులను అధిగమించి, సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్తాన్(Pakistan) మహిళ సీమా హైదర్(Seema Haidher) ప్రస్తుతం నోయిడాలో ఉంటోంది. భర్తను విడిచిపెట్టేసి నలుగురు పిల్లలతో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా తన ప్రియుడు సచిన్ మీనాతో(Sachin Meena) కలిసి ఉంటున్నది.
ప్రియుడు సచిన్ కోసం అష్టకష్టాలు పడి, అడ్డంకులను అధిగమించి, సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్తాన్(Pakistan) మహిళ సీమా హైదర్(Seema Haidher) ప్రస్తుతం నోయిడాలో ఉంటోంది. భర్తను విడిచిపెట్టేసి నలుగురు పిల్లలతో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా తన ప్రియుడు సచిన్ మీనాతో(Sachin Meena) కలిసి ఉంటున్నది. సచిన్, పిల్లలతో కలిసి ఆమె హర్ ఘర్ తిరంగా(Har ghar Tiranga) వేడుకలో పాల్గొన్నది. ఇంటి దగ్గర భారత జాతీయ జెండాను(Indian National Flag) ఎగురవేయడంతో పాటు భారత్ అనుకూల నినాదాలుచేసింది.
సీమా హైదర్, సచిన్‌ల ప్రణయగాథ ఆధారంగా కరాచీ టు నోయిడా పేరుతో సినిమా తీయాలని నిర్మాత అమిత్ జానీ అనుకున్నారు. ఈ క్రమంలో సీమా హైదర్ షూటింగ్‌లో పాల్గొన్న వీడియో క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే సినిమా ఆఫర్‌ను తిరస్కరించినట్టు సీమా హైదర్‌తో పాటు ఈ వేడుకలో పాల్గొన్న ఆమె తరఫు లాయర్ ఏపీ సింగ్ కూడా తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేనకు చెందిన అమేయా ఖోప్‌కర్ మాత్రం భారతీయ సినీ పరిశ్రమలో పాకిస్తాన్ పౌరులకు స్థానం లేదని అంటున్నారు.
భారత్‌లో ఉంటున్న పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ ఐఎస్ఐ ఏజెంట్ అన్న మాట కూడా వినిపిస్తున్నదని చెప్పారు. సినీ పరిశ్రమలో పైప్ కోసం సీమా హైదర్‌ను నటిగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తూ ఈ దేశద్రోహ నిర్మాతలకు సిగ్గులేదా? అని ప్రశ్నించారు ఖోప్‌కర్. ఈ రకమైన సినిమా డ్రామాకు తక్షణం ముగింపు పలకాలని అన్నారు. లేకపోతే ఎంఎన్‌ఎస్ చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అమేయా ఖోప్‌కర్ హెచ్చరిక నేపథ్యంలో సినిమా ఆఫర్‌ను తిరస్కరించినట్లు సీమా హైదర్ తెలిపారు. హర్ ఘర్ తిరంగా వేడుకల్లో పాల్గొన్న సీమా హైదర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.