పబ్జీ గేమ్‌లో(PubG) పరిచయమైన ప్రేమికుడి కోసం పాకిస్తాన్(Pakistan) నుంచి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ ఇంకా వార్తల్లో నలుగుతూనే ఉంది. ఆమె పాకిస్తాన్ ఏజెంటా? లేక నిజంగానే ప్రేమ కోసమే ఇండియాకు వచ్చిందా అన్నది ఇంకా తేలలేదు. కాకపోతే ఆమెకు ఓ బ్రహ్మండమైన అవకాశం వచ్చింది.

Seema Haidher Got Movie Chance
పబ్జీ గేమ్‌లో(PubG) పరిచయమైన ప్రేమికుడి కోసం పాకిస్తాన్(Pakistan) నుంచి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్(Seema Haidher) ఇంకా వార్తల్లో నలుగుతూనే ఉంది. ఆమె పాకిస్తాన్ ఏజెంటా? లేక నిజంగానే ప్రేమ కోసమే ఇండియాకు వచ్చిందా అన్నది ఇంకా తేలలేదు. కాకపోతే ఆమెకు ఓ బ్రహ్మండమైన అవకాశం వచ్చింది. ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్(Tailor Kanhaiya Lal) హత్య ఘటనపై జానీ ఫైర్‌ఫాక్స్(Johnny Firefox) ప్రొడక్షన్ హౌస్ ఓ సినిమా తీస్తోంది. ఆ చిత్రానికి ఏ టైలర్ మర్డర్ స్టోరీ(A Tailor Murder story) అనే పేరు పెట్టింది. ఇందులో రా ఏజెంట్ పాత్ర కోస సీమా హైదర్‌ను సంప్రదించారు. దర్శకులు జయంత్ సిన్హా, భరత్‌సింగ్‌లు సీమకు అడిషన్ కూడా నిర్వహించారు. నోయిడాకు చెందిన సచిన్ మీనాను పెళ్లి చేసుకున్న సీమా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉంటున్నారు. కొత్త ఇంటికి మారిన తర్వాత వారు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు మీడియాకు చెప్పారు. ఇది జరిగిన కొద్ది రోజులకే వీరిని సినీ దర్శకులు సంప్రదించారట!
