పాకిస్తాన్ మహిళ సీమా హైదర్(Seema Haider) ప్రేమ కోసం పెద్ద సాహసమే చేసింది. పబ్జీ గేమ్(PUBG game) ద్వారా పరిచయమైన సచిన్ కోసం నలుగురు పిల్లలను వెంటేసుకుని పాకిస్తాన్ నుంచి అక్రమంగా భారత్(Pakistan To India)కు వచ్చింది. తన ప్రియుడు సచిన్ కోసం చాలానే కష్టపడింది. ఈ ప్రణయగాధ అచ్చంగా బాలీవుడ్ సినిమా(Bollywood Movie)ను తలపించేట్టుగానే ఉంది.
పాకిస్తాన్ మహిళ సీమా హైదర్(Seema Haider) ప్రేమ కోసం పెద్ద సాహసమే చేసింది. పబ్జీ గేమ్(PUBG game) ద్వారా పరిచయమైన సచిన్ కోసం నలుగురు పిల్లలను వెంటేసుకుని పాకిస్తాన్ నుంచి అక్రమంగా భారత్(Pakistan To India)కు వచ్చింది. తన ప్రియుడు సచిన్ కోసం చాలానే కష్టపడింది. ఈ ప్రణయగాధ అచ్చంగా బాలీవుడ్ సినిమా(Bollywood Movie)ను తలపించేట్టుగానే ఉంది. అందుకే సీమా హైదర్ జీవిత చరిత్ర ఇప్పుడు బాలీవుడ్ రచయితలకు కథా వస్తువయ్యింది. ఆమె లైఫ్‌స్టోరీ ఆధారంగా ఓ సినిమా కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిర్మిస్తున్నది అమిత్ జానీ(Amit Jani)అనే వ్యక్తి! సినిమాకు సంబంధించిన విషయాల గురించి ఆయన చెబుతూ 'పబ్జీ గేమ్ ఆడుతుండగా ఈ ప్రేమకథ మొదలయ్యింది. అసలు పరిచయం ప్రేమగా ఎలా మారింది? ఆమె ఇండియాకు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? కొందరు అనుమానిస్తున్నట్టు సీమా పాకిస్తాన్ ఏజెంటా? ఎవరి కోసం ఆమె పని చేస్తున్నది? అనే విషయాలను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాం. అందుకే సీమా హైదర్ గురించి ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా ఈ సినిమాలో చూపించాలి' అని అన్నారు. ఈ సినిమాను జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్(Jani Firefox Films)పై నిర్మిస్తున్నామన్నారు అమిత్ జానీ. ఈ సినిమాకు కరాచీ టు నోయిడా (Karachi to Noida) అనే పేరును ఖరారు చేశామని చెప్పారు. సీమా జీవితం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఆమె మాజీ భర్త గులాం హైదర్‌ను సంప్రదించాలనుకుంటున్నామన్నారు. ఒకవేళ గులాం ఇండియాకు రాలేకపోతే ప్రస్తుతం ఆయన ఉంటున్న సౌదీ అరేబియాకు రచయితను పంపిస్తామని, ఈ చిత్రంలోని సీమా, సచిన్ పాత్రదారుల ఎంపిక మరో రెండు రోజుల్లో పూర్తి అవుతుందని తెలిపారు. నేపాల్ మీదుగా భారత్‌లో అడుగుపెట్టిన సీమ తన ప్రయాణాన్ని కొనసాగించిన దుబాయ్(Dubai)లోనే ఈ సినిమా చిత్రీకరణ ఉంటుందని వివరించారు అమిత్ జానీ. సచిన్ కోసం పాకిస్తాన్ సరిహద్దును దాటి భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టిన సీమాహైదర్ ఉదంతంలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఉదయ్‌పుర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య ఘటనపై ఏ టైలర్ మర్డర్ స్టోరీ పేరిట ఓ చిత్రాన్ని జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ త్వరలో రూపొందించనుంది. . ఈ సినిమాలో ‘రా’ ఏజెంట్ పాత్ర కోసం సీమాను సంప్రందించిన విషయం తెలిసిందే.