పబ్జీ(Pubg) ప్రేమకథ ఊహించని మలుపులు తిరుగుతోంది. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్‌(Pakistan) మహిళ సీమా హైదర్‌ను(Seema Haidher) ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) యువకుడు సచిన్‌ మీనా(sachin Meena) ముందుగా నేపాల్‌లో కలిశాడట! వీరిద్దరు భారత్‌కు రావడానికి ముందు కొద్ది రోజుల పాటు నేపాల్‌(Nepal) రాజధాని కాఠ్మాండూలోని(Kathmandu) న్యూ వినాయక హోటల్‌ ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయాన్ని హోటల్‌ యజమాని కూడా చెప్పాడు.

పబ్జీ(Pubg) ప్రేమకథ ఊహించని మలుపులు తిరుగుతోంది. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్‌(Pakistan) మహిళ సీమా హైదర్‌ను(Seema Haidher) ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) యువకుడు సచిన్‌ మీనా(sachin Meena) ముందుగా నేపాల్‌లో కలిశాడట! వీరిద్దరు భారత్‌కు రావడానికి ముందు కొద్ది రోజుల పాటు నేపాల్‌(Nepal) రాజధాని కాఠ్మాండూలోని(Kathmandu) న్యూ వినాయక హోటల్‌ ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయాన్ని హోటల్‌ యజమాని కూడా చెప్పాడు. మార్చి నెలలో సచిన్‌ మీనా, సీమా హైదర్‌లు తమ హోటల్‌కు వచ్చారని, వారం రోజుల పాటు ఇక్కడే ఉన్నారని న్యూ వినాయక హోటల్‌ యజమాని గణేశ్‌ తెలిపారు. హోటల్‌ గదిన నుంచి వారు సాయంత్రం మాత్రమే బయటకు వచ్చేవారని అన్నారు. హోటలకు ముందు సచిన్‌ వచ్చాడని, రిజిస్టర్‌లో తన పేరును శివాన్ష్‌గా నమోదు చేశాడని చెప్పారు. 'ఫ్యామిలీ గురించి అడిగితే తన భార్య మరుసటి రోజు వస్తుందని సచిన్‌ చెప్పాడు. సీమా హోటల్‌కు వచ్చేప్పుడు ఆమె ఒంటరిగానే వచ్చింది. కానీ, హోటల్‌ గది ఖాళీ చేయడానికి ఒకరోజు ముందుగానే ఆమె వెళ్లిపోయింది. తర్వాత సచిన్‌ హోటల్‌ గది ఖాళీ చేశాడు. భారత కరెన్సీలో సచిన్ హోటల్‌ అద్దె చెల్లించాడు’’ అని గణేశ్‌ తెలిపాడు.

మరోవైపు మార్చి 10న సచిన్‌ మీనా గోరఖ్‌పుర్‌ నుంచి కాఠ్మాండూకు వెళ్లి హోటల్‌ గదిని బుక్‌ చేసినట్లు ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసులు తెలిపారు. సచిన్‌ను కలుసుకునేందుకు షార్జా మీదుగా సీమా హైదర్‌ నేపాల్‌ చేరుకుని.. ఆ తర్వాత భారత్‌కు వచ్చిందని అన్నారు. సచిన్‌తో ఉండేందుకు ఆమె పాకిస్తాన్‌లోని కొత్త ఇంటిని అమ్మేసినట్లు విచారణలో తేలిందన్నారు. సీమా తన నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లో అక్రమంగా నివసిస్తున్నట్లు యూపీ ఏటీస్‌ పోలీసులు గుర్తించారు. కానీ కాఠ్మాండూకు వచ్చినప్పుడు మాత్రం తనతో ఎవరూ లేరని హోటల్‌ యజమాని గణేశ్‌ చెప్పడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏదో పెద్ద ప్లాన్‌తోనే సీమా హైదర్‌ ఇండియాలో అడుగుపెట్టిందని పోలీసులు భావిస్తున్నారు.

Updated On 20 July 2023 4:13 AM GMT
Ehatv

Ehatv

Next Story