పెళ్లిళ్లకో, పేరంటాళ్లకో, గృహప్రవేశాలకో వెళ్లినప్పుడు రిటర్న్ గిఫ్ట్‌లు(Return Gift) ఇవ్వడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. అయితే చత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) కోర్బా(Korba) నగరం ముదాపర్ ప్రాంతానికి చెందిన సేదవ్ యాదవ్(Sedav Yadav) అనే వ్యక్తి మాత్రం రిటర్న్ గిఫ్ట్‌లకు ఓ పరామర్థాన్ని తెచ్చారు.

Hetmel Return Gift
పెళ్లిళ్లకో, పేరంటాళ్లకో, గృహప్రవేశాలకో వెళ్లినప్పుడు రిటర్న్ గిఫ్ట్‌లు(Return Gift) ఇవ్వడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. అయితే చత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) కోర్బా(Korba) నగరం ముదాపర్ ప్రాంతానికి చెందిన సేదవ్ యాదవ్(Sedav Yadav) అనే వ్యక్తి మాత్రం రిటర్న్ గిఫ్ట్‌లకు ఓ పరామర్థాన్ని తెచ్చారు. తన కూతురు పెళ్లిని రోడ్డు భద్రతపై(Road saftey) ప్రజలలో అవగాహన కల్పించడానికి దొరికిన మంచి అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకున్నాడు. పెళ్లికి వచ్చిన అతిథులకు ఆయన హెల్మెట్‌లు(Helmet), స్వీట్లు(Sweet) కానకగా ఇచ్చాడు. రోడ్ సేఫ్టీపై ప్రజలలో అవగాహన కల్పించడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సేదవ్ యాదవ్ తెలిపాడు. సేద్ యాదవ్ కూతురు నీలిమ స్పోర్ట్స్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల ఆమెకు సరాన్‌గఢ్ బిలాయ్‌గఢ్ జిల్లా లంకహుడా గ్రామానికి చెందిన కమ్హాన్ యాదవ్‌తో పెళ్లి జరిగింది. తన కూతురు పెళ్లి సందర్భంగా సమాజానికి ఉపయోగపడే ఏదైనా మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు సేద్ యాదవ్. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకు హెల్మెట్‌లను రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతే కాకుండా పెళ్లి వేడుకల్లో సేదవ్ యాదవ్ కుటుంబం హెల్మెట్‌లు ధరించి డాన్సులు చేశారు. జీవితం చాలా విలువైనదని, మందు తాగి వాహనాలు నడపవద్దని అతిథులకు సేదవ్ యాదవ్ సందేశం ఇచ్చారు.
