ఈ నెల 22న అయోధ్యలో(Ayodhya) ప్రతిష్టించే విగ్రహాన్ని(Idol) మైసూరుకు చెంది శిల్పి అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) తయారుచేసిన విషయం తెల్సిందే. అయితే ఈ విగ్రహం తయారీ వెనుక అరుణ్ యోగిరాజ్ కఠోర దీక్ష చేశాడట. విగ్రహం తయరీ సందర్భంలో ఆరు నెలలపాటు కుటుంబసభ్యులతో(family) కూడా అరుణ్ యోగిరాజ్ మాట్లాడలేదట. కనీసం ఫోన్ కూడా ఆయన చూడలేదు.
ఈ నెల 22న అయోధ్యలో(Ayodhya) ప్రతిష్టించే విగ్రహాన్ని(Idol) మైసూరుకు చెంది శిల్పి అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) తయారుచేసిన విషయం తెల్సిందే. అయితే ఈ విగ్రహం తయారీ వెనుక అరుణ్ యోగిరాజ్ కఠోర దీక్ష చేశాడట. విగ్రహం తయరీ సందర్భంలో ఆరు నెలలపాటు కుటుంబసభ్యులతో(family) కూడా అరుణ్ యోగిరాజ్ మాట్లాడలేదట. కనీసం ఫోన్ కూడా ఆయన చూడలేదు. గతంలో కూడా అరున్ కేదార్‌నాథ్‌లోని(Kedharnath) శంకరాచార్యుల విగ్రహం(Shankaracharya Idol), ఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్(Subash Chandrabose) విగ్రహాలను కూడా రూపొందించాడు. అరుణ్ పూర్వీకులు కూడా విగ్రహాలు తయారుచేసేవారు.
ఈ క్రమంలో అయోధ్య రామమందిరంలో(Ram mandir) ఈనెల 22న ప్రతిష్టించేందుకు మైసూరుకు(Mysore) చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 150 నుంచి 200 కిలోల వరకు బరువున్న ఈ విగ్రహాన్ని జనవరి 18న గర్భగుడిలోకి చేర్చుతామని అన్నారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని చెప్పారు. గర్భగుడిలో పాత విగ్రహంతో పాటు కొత్త విగ్రహం కూడా ఉంటుందని వెల్లడించారు. ఈరోజు నుంచి ప్రాణప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు మొదలవుతాయని వెల్లడించారు.