ఈ కాలంలో ఫోన్‌లు, సోషల్ మీడియాలో పోర్న్ చూస్తూ చిన్నవయసులోనే తప్పటడుగులు వేస్తున్నారు.
ఈ కాలంలో ఫోన్‌లు, సోషల్ మీడియాలో పోర్న్ చూస్తూ చిన్నవయసులోనే తప్పటడుగులు వేస్తున్నారు. స్కూల్ సమయంలోనే ప్రేమ, దోమ అంటూ తిరుగుతున్నారు. స్కూల్‌కు వెళ్తున్నామంటూ పార్కులకు వెళ్లి విహరిస్తున్నారు. సరసాలకు కాదేదీ అనర్హమంటూ సందుల్లో, చెట్ల పొదల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో సరసాలాడుతున్నారు. లవర్ ఉండటాన్ని ఈ కాలం పిల్లలు స్టేటస్ సింబల్‌గా మార్చుకుంటున్నారు. చిన్నవయసులోనే పెద్ద పనులు చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా స్కూల్‌కు వెళ్లే ఇద్దరు పిల్లలు ఓ సందులో దూరి రొమాన్స్ చేస్తున్న వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ బాలిక, బాలుడు స్కూల్ యూనిఫాం వేసుకొని ఉన్నారు. ఓ సందులో దూరి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ముద్లుల్లో మునిగిపోయారు. చాటుమాటుగా ఎవరో వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియా ప్రియులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వయసులో ఏం పోయేకాలంరా అంటుననారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచిస్తున్నారు.