స్క్రాప్‌ మెటీరియల్‌ మాఫియా డాన్‌ (Scrap Mafia) రవి కానా(Ravi kana), అతడి గర్ల్‌ ఫ్రెండ్‌ కాజల్‌ ఝాను(Kajal Jha) పోలీసులు థాయ్‌లాండ్‌లో(Thailand) అరెస్ట్(Arrest) చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ రవి కానా చాలా కాలం నుంచి పాత ఇనుప సామాన్ల వ్యాపారంలో ఉన్నాడు. అనేక కేసులలో నిందితుడుగా ఉన్న ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

స్క్రాప్‌ మెటీరియల్‌ మాఫియా డాన్‌ (Scrap Mafia) రవి కానా(Ravi kana), అతడి గర్ల్‌ ఫ్రెండ్‌ కాజల్‌ ఝాను(Kajal Jha) పోలీసులు థాయ్‌లాండ్‌లో(Thailand) అరెస్ట్(Arrest) చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ రవి కానా చాలా కాలం నుంచి పాత ఇనుప సామాన్ల వ్యాపారంలో ఉన్నాడు. అనేక కేసులలో నిందితుడుగా ఉన్న ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇతడికి సంబంధించిన అన్ని వివరాలను నోయిడా పోలీసులు ఎప్పటికప్పుడు థాయ్‌లాండ్‌ పోలీసులతో తెలుసుకుంటూనే ఉన్నారు. జ‌న‌వ‌రిలో అత‌ని కోసం రెడ్ కార్న‌ర్ నోటీసు కూడా జారీ చేశారు.ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌ చట్టం కింద రవిని బుక్‌ చేశారు. ఇతడిపై గ్రేటర్‌ నోయిలా పోలీసు ఫిర్యాదు కూడా నమోదయ్యింది. రవీం‍ద్రనగర్‌లో 16 మంది గ్యాంగ్‌స్టర్లతో కలిసి చట్టవ్యతిరేక స్క్రాప్‌ మెటీరియల్‌ సరాఫరా, అమ్మకం దందా నిర్వహించాడు. స్క్రాప్‌ మెటీరియల్ డీలర్‌ అవతారమెత్తిన రవి కానా.. ఢిల్లీలోని పలువురు వ్యాపారులను దోపిడి చేసి కొద్ది కాలంలోనే కోట్లు సంపాదించాడు. మిలియ‌నీర్ అయ్యాడు. దొంగతనం, కిడ్నాపింగ్‌కు సంబంధించిన అతనిపై 11 కేసులు నమోదయ్యాయి. పలు స్క్రాప్‌ గోడౌన్లను గ్యాంగ్‌స్టర్‌ కార్యకలాపాలకు ఉపయోగించుకున్న రవి కానా గ్యాంగ్‌లోని ఆరుగురు ఇప్పటకే అరెస్ట్‌ అయ్యారు.గ్రేట‌ర్ నోయిడాలో ఉన్న ప‌లు స్క్రాప్ గోడౌన్ల‌ను సీజ్ చేశారు. కానాతో పాటు అత‌నికి సంబంధం ఉన్న వ్య‌క్తుల‌కు చెందిన సుమారు 120 కోట్ల‌ రూపాయలను సీజ్ చేశారు. ఉద్యోగం కోసం గ్యాంగ్‌స్టర్‌ రవిని కలిసిన కాజల్‌ ఝా తర్వాత అదే గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా మారారు. అనంతరం రవి గర్ల్‌ఫ్రెండ్‌ అయ్యారు. కాజ‌ల్ జాకు సుమారు వంద కోట్ల ఖ‌రీదైన బిల్డింగ్‌ను కానా గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ బిల్డింగ్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు.

Updated On 24 April 2024 4:40 AM GMT
Ehatv

Ehatv

Next Story