ఓ పాత స్కూటీ(scooty) ఎంతుంటుంది? మహా అయితే 30 వేల రూపాయలుంటుందంతే! ఆ మాత్రం రేటున్న ఆ స్కూటీకి పడిన జరిమానా(Fine) ఎంతో తెలుసా? అక్షరాల 3.22 లక్షల రూపాయలు. మీరు విన్నది నిజమే! ఇదేదో అధికారుల పొరపాటు వల్ల జరిగిందనుకోకండి. ఆ స్కూటీ వాహనదారుడి నిర్వాకం వల్లే ఇంత ఫైన్‌ పడింది. ఇది జరిగింది బెంగళూరు(Bangalore) నగరంలోని ఆర్‌టి నగర్‌లో.. బెంగళూరు రోడ్డుపై ట్రాఫిక్‌ నియమాలను 643 సార్లు ఉల్లంఘించాడు ఈ ఘనుడు.

ఓ పాత స్కూటీ(scooty) ఎంతుంటుంది? మహా అయితే 30 వేల రూపాయలుంటుందంతే! ఆ మాత్రం రేటున్న ఆ స్కూటీకి పడిన జరిమానా(Fine) ఎంతో తెలుసా? అక్షరాల 3.22 లక్షల రూపాయలు. మీరు విన్నది నిజమే! ఇదేదో అధికారుల పొరపాటు వల్ల జరిగిందనుకోకండి. ఆ స్కూటీ వాహనదారుడి నిర్వాకం వల్లే ఇంత ఫైన్‌ పడింది. ఇది జరిగింది బెంగళూరు(Bangalore) నగరంలోని ఆర్‌టి నగర్‌లో.. బెంగళూరు రోడ్డుపై ట్రాఫిక్‌ నియమాలను 643 సార్లు ఉల్లంఘించాడు ఈ ఘనుడు. అందుకు స్కూటీకి లక్షల రూపాయల జరిమానా పడింది. స్కూటీపై ప్రయాణించిన వ్యక్తి హెల్మెట్‌ లేకపోవడం, సిగ్నల్‌ జంప్‌ ద్వారా 643 సార్లు నిబంధనలను అతిక్రమించాడు. ట్రాఫిక్‌ కెమెరాలో(Traffic Camera) ఇవన్నీ రికార్డ్‌ అయ్యాయి. దీంతో మొత్తం చలానాలను లెక్కించగా 3.22 లక్షల రూపాయలుగా తేలింది. ఇక ఆ స్కూటీ విలువ 30 వేల రూపాయలకు మించదు. దీంతో ఆ స్కూటీ వ్యక్తి కోసం ట్రాఫిక్‌ పోలీసులు గాలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ నంబర్ కేఏ04KF9072తో ఈ స్కూటీ ఫిబ్రవరి 2022లో విక్రయమయ్యింది. ఈ వివరాలను బెంగళూరు ట్రాఫిక్ పోలీసు విభాగం తమ వెబ్‌సైట్‌లో నమోదు చేసింది.

Updated On 19 Dec 2023 2:21 AM GMT
Ehatv

Ehatv

Next Story