Oldest Dinosaur Fossil Found In Rajasthan : థార్ లో అతి ప్రాచీన డైనోసార్ శిలాజం లభ్యం
దిల్లీ: ఐఐటీ-రూర్కీ, జియోలాజికల్ సర్వేఆఫ్ ఇండియా (GSI) పరిశోధకులు రాజస్థాన్(Rajastan)జైసల్మేర్‌లోని(Jaisalmer) థార్ ఎడారిలో 18 కోట్ల ఏళ్ల క్రితం నాటి డైనోసార్(Dinosaur) శిలాజాన్ని కనుగొన్నారు.
దిల్లీ: ఐఐటీ-రూర్కీ, జియోలాజికల్ సర్వేఆఫ్ ఇండియా (GSI) పరిశోధకులు రాజస్థాన్(Rajastan)జైసల్మేర్‌లోని(Jaisalmer) థార్ ఎడారిలో 18 కోట్ల ఏళ్ల క్రితం నాటి డైనోసార్(Dinosaur) శిలాజాన్ని కనుగొన్నారు. డైక్రెయోసౌరిడ్(dichreosaurid) శాఖకు చెందిన ఈ జీవి పొడవైన మెడ కలిగిన శాకాహారి(Vegeterian). 28 నుంచి 45 అడుగుల పొడవు, పొట్టి తోక దీని ప్రత్యేక లక్షణాలు. ఇంతకుముందు చైనాలో కనుగొన్న డైక్రెయోసౌరిడ్ 18.8 కోట్ల నుంచి 18.4 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. దానికన్నా పురాతనమైన శిలాజం థార్ ఎడారిలో దొరకడం విశేషం.అపూర్వమైన ఈ పరిశోధన డైనోసార్ పరిణామ చరిత్రలో భారత్ ప్రధాన పాత్ర వహించిందని స్పష్టం చేస్తోంది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2018 లో రాజస్థాన్ లోని జైసల్మేర్ రీజియన్‌లో మధ్యయుగ జురాసిక్ శిలల్లో శిలాజాల తవ్వకాలను చేపట్టడంతో ఇవి లభ్యమయ్యాయి. దీనికి మన పరిశోధకులు 'థారోసారస్ ఇండికస్' అని పేరు పెట్టారు. భారత్‌లో ఇలా డైక్రెయోసౌరిడ్ రెప్టైల్ శిలాజం దొరకడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు మధ్య భారత్ లో 19 కోట్ల నుంచి 18.5 కోట్ల ఏళ్ల క్రితం నాటి రెండు రకాల రెప్టైల్ శిలాజాలు లభించాయి. ఇంతవరకు ఈ డైనోసార్ తెగ గురించి శాస్త్రవేత్తలకు ఎలాంటి సమాచారం లభించలేదు. డైక్రెయోసారిడ్ డైనోసార్ శిలాజాలు ఇప్పటివరకు ప్రపంచం లోని ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, చైనా లోనే లభ్యం అయ్యాయి. ఇది ప్రపంచం మొత్తం మీద అతిప్రాచీన డిప్లొడొకోయిడ్ డైనోసార్‌గా కూడా గుర్తించారు. ఇంతవరకు భారత్‌లో మాత్రం వీటి శిలాజాలు లభ్యం కాలేదు. ఇప్పుడు భారత్‌లో కూడా అతిప్రాచీన డైనోసార్ శిలాజం లభ్యం కావడం చారిత్రక విశేషమే.