హిమాలయాలు(himalayas) ఎన్నో జీవనదులకి పుట్టినిల్లు అని మనందరికీ తెలుసు. గంగ(Ganga), సింధు(Sindhu), బ్రహ్మపుత్ర వంటి నదులు హిమాలయాల్లో జన్మించినవే. వీటితో పాటు మరి కొన్ని నదులకు కూడా హిమాలయాలు జన్మస్థానం. అలా హిమాలయాల్లో పుట్టిన నదులు భూమండలాన్ని సస్యశ్యామలం చేస్తు కోట్ల జీవరాశుల మనుగడకు ఆలవాలంగా ఉన్నాయి. కాని నదులే కాదు హిమాలయాల్లో సముద్రం(sea) కూడా ఉండేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

హిమాలయాలు(himalayas) ఎన్నో జీవనదులకి పుట్టినిల్లు అని మనందరికీ తెలుసు. గంగ(Ganga), సింధు(Sindhu), బ్రహ్మపుత్ర వంటి నదులు హిమాలయాల్లో జన్మించినవే. వీటితో పాటు మరి కొన్ని నదులకు కూడా హిమాలయాలు జన్మస్థానం. అలా హిమాలయాల్లో పుట్టిన నదులు భూమండలాన్ని సస్యశ్యామలం చేస్తు కోట్ల జీవరాశుల మనుగడకు ఆలవాలంగా ఉన్నాయి. కాని నదులే కాదు హిమాలయాల్లో సముద్రం(sea) కూడా ఉండేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

చరిత్ర అంటే కాలగర్భంలో కలిసిపోయినది అనే విషయం మనకి తెలుసు. కానీ అలాంటి చరిత్రని వెలికి తీసి ప్రపంచానికి అందించే పరిశోధకులు ఇప్పుడు మరో అద్భుతాన్ని కనుగొన్నారు. హిమాలయాల్లో నదులే కాదు సముద్రం కూడా ఉండేదని కనుగొన్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, జపాన్‌లోని నీగాటా యూనివర్సిటీ కి చెందిన శాస్త్రవేత్తలు దాదాపు 600 మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయాల్లో సముద్రం ఉండేదని గుర్తించారు. హిమాలయాల్లోని మంచు బిందువుల్లో దాగిఉన్న క్యాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్‌ నిక్షేపాలలో పురాతన సముద్ర నీటి బిందువులను కనిపెట్టామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

హిమాలయాలలో దాదాపు 600 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రం ఉండేదని. అక్కడ దొరికిన ఖనిజ నిక్షేపాలలో చిక్కుకున్న నీటి బిందువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నిక్షేపాలు పశ్చిమ కుమయోన్‌ హిమాలయాలలో లభించాయి. భూమి పుట్టుకకు సంబంధించిన ఆక్సిజనేషన్‌ ఏర్పడటానికి దారి తీసిన సంఘటనలను గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను శాస్త్రవేత్తలు బైటపెట్టారు.

దాదాపు 70 కోట్ల సంవత్సరాల క్రితం భూమి అంతా మంచుతో కప్పబడి ఉండేదని . దీన్ని స్నోబాల్ ఎర్త్ గ్లేసియేషన్ అని పిలువబడి హిమనీనదానికి గురైందని శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పట్లో నదుల నుంచి సముద్రాలకు చేరే నీటి పరిమాణం బాగా తక్కువుండేదట. కాబట్టి సముద్రాలలో కాల్షియం సరిగా అందేది కాదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాల్షియం తక్కువ మోతాదులో ఉండటం వల్ల నీటిలో జీవించే జీవాలకు పోషకాలు అందకపోయేవని, అటువంటి వాతావరణ పరిస్థితులు కిరణజన్య సంయోగ క్రియ చేయగల సైనోబ్యాక్టీరియాకు అత్యంత అనువైనదని..ఆ బ్యాక్టీరియా భూ వాతావరణంలోకి పెద్దఎత్తున ఆమ్లజనిని విడుదల చేశాయని తెలిపారు. పుష్కలంగా ఆమ్లజని లభించడంతో భూమిపై జీవజాతులు విస్తరించాయిని శాస్త్రవేత్త ఆర్య తెలిపారు. ఈ అవశేషాల అధ్యయనంతో భూమిపై సముద్రాలు, జీవజాతుల పరిణామంపై అవగాహన పెంచుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తల బృందం హిమాలయాలలో అమృత్‌పుర్‌ నుంచి మిలామ్‌ హిమనీనాదం వరకు, అలాగే డెహ్రాన్ డూన్ నుంచి గంగోత్రి వరకు సముద్రాల ఉనికి కోసం పరిశోధనలు సాగించారు. ఆ పరిశోధనల్లో పురాతన సముద్రపునీటి ఉనికిని గుర్తించారు. వీరి పరిశోధనలు భూమి చరిత్రకు సంబంధించి మహా సముద్రాల ఉనికి వాటి పరిణామక్రమానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Updated On 31 July 2023 6:08 AM GMT
Ehatv

Ehatv

Next Story