Science behind kites: పతంగులు చెప్పే పాఠాలు..అవి మీకు తెలుసా..?
సంక్రాంతి..అంటేనే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి గాలి పటాలు. సంక్రాంతి వచ్చిందంటే దేశ వ్యాప్తంగా పతంగుల సందడి కనిపిస్తుంది. సంక్రాంతి నాడు ఆకాశంలో గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తాయి. ఒకరి గాలిపటాన్ని మరొకరు కట్ చేస్తూ..ఆనందంతో కేరింతలు కొడుతారు. ఈ రోజున పిల్లలే కాదు పెద్దలు కూడా ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తారు. కానీ.. గాలి పటాలు ఎగరేవయడం వెనుక పలు శాస్త్రీయ కారణాలు ఉన్నాయనే సంగతి చాలా మందికి తెలియదు.
సంక్రాంతి..అంటేనే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి గాలి పటాలు. సంక్రాంతి వచ్చిందంటే దేశ వ్యాప్తంగా పతంగుల సందడి(buzz of kites) కనిపిస్తుంది. సంక్రాంతి నాడు ఆకాశంలో గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తాయి. ఒకరి గాలిపటాన్ని మరొకరు కట్ చేస్తూ..ఆనందంతో కేరింతలు కొడుతారు. ఈ రోజున పిల్లలే కాదు పెద్దలు కూడా ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తారు. చాలా ప్రాంతాల్లో పతంగుల పోటీలను నిర్వహిస్తుంటారు. సంక్రాంతి రోజున గాలిపటాలు ఎందుకు ఎగురు వేస్తారనే ఆలోచన చాలా మంది మదిలో మెదిలే ఉంటుంది. గాలి పటాలు ఎగరేవయడం వెనుక పలు శాస్త్రీయ కారణాలు(Scientific reasons) ఉన్నాయనే సంగతి చాలా మందికి తెలియదు. మకర సంక్రాంతి (Makar Sankranti)నాడు బహిరంగ ప్రదేశాల్లో గాలిపటాలు ఎగురవేయడం ద్వారా సూర్యుని నుండి వచ్చే విటమిన్ డి(Vitamin D) మనకు పుష్కలంగా అందుతుంది. డి విటమిన్ మన శరీరానికి చాలా ముఖ్యం. ఎండలో నిలుచుని గాలిపటాలు ఎగురవేయడం ద్వారా చలినుంచి రక్షణ పొందడంతోపాటు.. శరీరాన్ని వ్యాధుల బారి నుండి కాపాడుకోవచ్చు. అలాగే పతంగులు ఎగురవేయడం వెనుక కొన్ని మతపరమైన కారణాలు(Religious reasons) కూడా లేకపోలేదు. ఇతిహాసాల ప్రకారం.. మకర సంక్రాంతి నాడు పతంగులు ఎగురవేసే సంప్రదాయాన్ని శ్రీరాముడు ప్రారంభించాడు. శ్రీరాముడు తొలిసారి గాలిపటం ఎగురవేసినప్పుడు..అది ఇంద్రలోకానికి వెళ్లిందట. నాటి నుంచి శ్రీరాముడు ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని హిందువులు భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. మకర సంక్రాంతి రోజున పతంగులు ఎగురవేయడం (Flying kites), ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ద్వారా సౌభ్రాతృత్వం, సంతోషం వెల్లివిరుస్తాయి. గాలిపటం అనేది ఆనందం, స్వేచ్ఛ, ఐశ్వర్యానికి ప్రతీకగా చెబుతుంటారు. అలాగే మకర సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసి, సూర్యభగవానుని పూజించి (Sun god Worship), దానాలు చేయడం హిందువుల సంప్రదాయంగా చెబుతుంటారు.