సాధారణంగా వివాహమైన మహిళలు(Married Women) తప్పనిసరిగా గాజులు, మెట్టెలు(Toe rings), తాళి(Nupital chain), ముక్కుపుడక ధరించాలని హిందూ సంప్రదాయాలు(Traditional) తెలుపుతాయి. దీంతో పూర్వీకులు మనకు ఈ నియమాలను విధించారు. పెళ్లి తర్వాత బొట్టు, పూలు(Flowers), గాజులు(Bangles), మెట్టెలు ధరించి మెట్టినింటికి నిండు సౌభాగ్యాన్ని అందించేందుకు ఇలాంటి నియమ, నిబంధనలు విధించారని అంటుంటారు. అయితే గాజులు, మెట్టెలు ధరించడం వెనుక ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

కాలి బొటన వేలి పక్కనున్న వేలుకు మెట్టెలు ధరిస్తారు. మహిళలకు వేలు ఆయువుపట్టిలాంటిదని.. ఈ వేలు నేలకు తాకకూడదనే ఉద్దేశంతో మెట్టెలు పెట్టుకునే సంప్రదాయన్ని మన పూర్వీకులు పెట్టారని చెప్తున్నారు. అయితే దీని వెనకాల మరో కారణం కూడా ఉందట. మెట్టెలు ధరించే వేలు నుంచి ప్రత్యేక నరం ఒకటి గర్భాశయానికి(Womb), గుండెకు(Heart) అనుసంధానమై ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. దీని ద్వారా గుండె, గర్భాశయ సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. జననేంద్రియ సమస్యలు తగ్గి సంతానోత్పత్తికి మార్గం సులువవుతుందని అంటున్నారు. పునరుత్పత్తి చేసే నరాలపై ఈ మెట్టెలు ఒత్తిడిని కలిగించి సంతాన సామార్థ్యాన్ని(Fertlity) పెంచుతాయని చెప్తున్నారు. పెళ్లికి ముందు ఉండే గైనిక్‌ సమస్యలు పెళ్లి తర్వాత ఈ మెట్టెలు ధరించడం వల్ల క్రమేణ సమస్యలు తగ్గుతాయని.. ఇందుకోసమే ఈ మెట్టెలు ధరించే నిబంధనను పూర్వీకులు ప్రవేశపెట్టారని అంటారు.

ఇక మహిళలు చేతికి గాజులు వేసుకోవడం కేవలం సంప్రదాయమే కాకుండా దీని వెనుకాల మరో సైంటిఫిక్‌ రీజన్‌ ఉందని అంటున్నారు. మణికట్టు దగ్గర గాజులు రాపిడికి గురై రక్తం సరఫరా సులువుగా ఉంటుందని అంటున్నారు. చేతులకు గాజులు వేసుకుంటే రక్త ప్రసరణ సాఫీగా సాగుతుందంటున్నారు. గర్భిణీలు చేతి నిండా గాజులు వేసుకొని డెలీవరి వరకు ఉంచుకుంటే.. ప్రసవ సమయంలో నొప్పి తట్టుకోలేక చేతులు అటు, ఇటూ ఊపడం వల్ల రాపిడికి గురయ్య మహిళలకు మరింత శక్తి వస్తుందని అంటున్నారు. దీంతో నొప్పిని భరించే శక్తి వస్తుందని చెప్తున్నారు. హిందూ సాంప్రదయాంలో ఆచారాల వ్యవహారాల వెనుక ఇంతటి నిగూఢ అర్థాలు దాగి ఉంటాయని చెప్తున్నారు.

Updated On 3 Jan 2024 4:35 AM GMT
Ehatv

Ehatv

Next Story