దేశ రాజధాని ఢిల్లీని(Delhi) వాయు కాలుష్యం(Air pollution) భయపెడుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీని(Delhi) వాయు కాలుష్యం(Air pollution) భయపెడుతున్నది. ఇళ్ళు, ఆఫీసులలోకి పొగ చొరపడింది. జనాలను ఇంట్లో కూడా ఉండనివ్వడం లేదు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కళ్లు పొడిబారుతున్నాయి. మంట పుడుతున్నది. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం తీవ్రతకు వృద్ధులు నానా తిప్పలు పడుతున్నారు. కాలుష్యం కారణంగా 14 విమానాలను దారి మళ్లించారు. బడులు మూసివేశారు. ఆన్‌లైన్ తరగతులు(Online clases) చెప్తున్నారు. ఇంత తీవ్రమైన కాలుష్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ఢిల్లీ ప్రజలు అంటున్నారు. ఊపిరి తీసుకుంటున్నామో, పొగ తాగుతున్నామో అర్థం కానంతగా కాలుష్యం పెరిగిపోయిందని ఆవేదన చెందుతున్నారు. మాస్కులు పెట్టుకోకుండా ప్రజలు రోడ్డు మీదకు రావడం లేదు.
ఢిల్లీలో సోమవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 494గా రికార్డు అయ్యింది. ఆరేళ్లలో ఇది రెండో అత్యధికం. ఇంత కాలుష్యంలో ఊపిరి తీసుకోవడం అంటే రోజూ 49 సిగరెట్లు కాల్చటంతో సమానమట. ఆరోగ్యంగా ఉన్న వారు సైతం ఈ స్థాయి కాలుష్యానికి అనారోగ్యం పాలు అవుతున్నారు.