ఒడిశా ప్రభుత్వం (Odisha government)ఒక కీలక నిర్ణయం తీసుకుంది . ఒరిస్సాలో(Orissa) తాజాగా తొమ్మిది చోట్ల ఒక్కసారిగా అత్యధికంగా 40 డిగ్రీల (40 degrees)సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పెరగడంతో, ఏప్రిల్ 12 నుండి 16 వరకు అంగన్‌వాడీలతో పాటు పదో తరగతి వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ఒరిస్సా ముఖ్యమంత్రి(Orissa chief minister) నవీన్ పట్నాయక్ (Naveen Patnaik).గత కొన్ని రోజులుగా ఒరిస్సా అంతటా, వాతావరణ శాఖ హీట్‌వేవ్ హెచ్చరిక (Heat Wave )జారీ చేసింది .
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి గత కొద్ది రోజులుగా మాములు స్థాయిని మించి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదు అవుతున్నాయి . ఎండా, ఉక్కబొతతో జనం ఇబ్బందులు పడుతున్నారు . ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు . పనులకు వెళ్ళేవాళ్ళకి ఎండ కష్టాలు తప్పడం లేదు . ఈసారి ఎండలు సాధారణం కంటే తీవ్రస్థాయిలో ఉంటాయని వేడిగాలులు ,ఉక్కబోత విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది .
ఈ పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వం (Odisha government)ఒక కీలక నిర్ణయం తీసుకుంది . ఒరిస్సాలో(Orissa) తాజాగా తొమ్మిది చోట్ల ఒక్కసారిగా అత్యధికంగా 40 డిగ్రీల (40 degrees)సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పెరగడంతో, ఏప్రిల్ 12 నుండి 16 వరకు అంగన్‌వాడీలతో పాటు పదో తరగతి వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ఒరిస్సా ముఖ్యమంత్రి(Orissa chief minister) నవీన్ పట్నాయక్ (Naveen Patnaik).గత కొన్ని రోజులుగా ఒరిస్సా అంతటా, వాతావరణ శాఖ హీట్‌వేవ్ హెచ్చరిక (Heat Wave )జారీ చేసింది .
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్‌వాడీలు, పదోతరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బుధవారం నుంచి ఏప్రిల్ 16 వరకు మూసేయాలని ఆదేశాలు జారీచేశారు .
మంగళవారం సాయంత్రం జపాన్ (japan)పర్యటన నుండి వచ్చిన ఒరిస్సా ముఖ్యమంత్రి(Orissa CM) పట్నాయక్ వెంటనే ప్రస్తుత హీట్‌వేవ్ పరిస్థితితో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితిపై సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ముఖ్యంగా పంచాయితీ రాజ్, హౌసింగ్ & అర్బన్ డెవలప్‌మెంట్ మరియు ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
నీటి ఎద్దడిపై (Water Problem)ప్రత్యేక దృష్టి సారించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి (CM)కోరారు. వేడిగాలుల పరిస్థితుల్లో డిమాండ్‌కు అనుగుణంగా నిరంతరం విద్యుత్ సరఫరా (power Supply)చేయాలని ఇంధన శాఖను కూడా ఆయన ఆదేశించారు.