కర్నాటకలో(Karnataka) దారుణం చోటు చేసుకుంది. దళిత విద్యార్థుల(Dalit students) పట్ల ఓ స్కూల్‌ ప్రిన్సిపాల్‌(School Principle) అమానుషంగా ప్రవర్తించారు. ఓ స్కూల్‌లో ఉన్న సెప్టిక్‌ ట్యాంక్‌ను(Drainage) క్లీన్‌ చేయాలని దళిత విద్యార్థులను ఆ స్కూల్ ప్రిన్సిపాపల్ బలవంతపెట్టాడు. ఈ వార్త బయటకు పొక్కడంతో ప్రిన్సిపాల్‌పై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే...

కర్నాటక కమలూరు తాలూకాలోని యలువహళ్లిలోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయుడు(Teacher) మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో(Social media) వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 7వ, 8వ, 9వ తరగతులకు చెందిన ఆరుగురు విద్యార్థులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల సమక్షంలో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేశారు. ఈ పాఠశాలలో తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని విద్యార్థు వాపోయారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనను సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఆయన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్కూల్‌లో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప తెలిపారు.

Updated On 18 Dec 2023 4:18 AM GMT
Ehatv

Ehatv

Next Story