రోడ్డు ప్రమాదాలు ఎలా చొచ్చుకొస్తాయో తెలియదు..

రోడ్డు ప్రమాదాలు ఎలా చొచ్చుకొస్తాయో తెలియదు.. క్షణాల్లో రోడ్డు ప్రమాదాలు(Road accidents) జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఓ మహిళ రోడ్డు దాటుతుండగా ఊహించని రీతిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఓ ఆటో(Auto) మహిళపైకి దూసుకొచ్చింది. ఇటువైపు తల్లి కోసం ఎదరు చూస్తున్న ఓ స్కూల్‌ విద్యార్ధిని మెరుపు వేగంతో ఆటో దగ్గరికి వెళ్లి ఆటోను లేపింది. ఈ షాకింగ్‌ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. దీని వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మంగళూరులోని(Mangalore) కిన్నీగోళి రాంనగర్‌లో ఈ షాకింగ్‌ సంఘటన జరిగింది. ఓ మహిళ రోడ్డు దాటే ప్రయత్నం చేస్తోంది. ఆ సమయంలోనే స్పీడ్‌గా వచ్చి ఓ ఆటో మహిళను ఢీకొట్టి బోల్తాపడింది. ఆటో కింద మహిళ పడిపోయింది. అక్కడే తన తల్లి కోసం ఎదురుచూస్తున్న బాలిక తన తల్లిపై ఆటో పడడం చూసి కేకలు వేస్తూ ఆటోను లేపే ప్రయత్నం చేసింది. ఇందుకు తోడుగా ఆటోలో ఉన్న ప్రయాణికులు కూడా సహకరించడంతో ఆటోను పైకి లేపి కింద ఉన్న మహిళను కాపాడారు. మహిళను చేతనగా గుర్తించారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అదే ఆటోలో మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తోపాటు అందులోని ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు స్థానిక దుకాణంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఎంతో ధైర్య సాహసాలతో తల్లిని ఆటో ప్రమాదం నుంచి కాపాడిన బాలికను అందరూ ప్రశంసిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story