ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మ‌రో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్‌(Utterpradesh)లోని ఘజియాబాద్(Ghaziabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. స్కూల్ బస్సు(School Bus), కారు(Car) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మ‌రో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు(Police) మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ(CCTV Footage) కూడా వెలుగులోకి వచ్చింది.

మంగళవారం ఉదయం క్రాసింగ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఢిల్లీ-మీరట్(Delhi-Meerut) ఎక్స్‌ప్రెస్‌వేపై తాజ్ హైవే(Taj Highway) ఫ్లైఓవర్‌పై పాఠశాల బస్సు, SUV కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఒక‌రి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి అతి వేగమే కారణంగా చెబుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌వేపై స్కూల్ బస్సు రాంగ్ డైరెక్షన్‌లో వస్తోంది. కారులో ఉన్న కుటుంబం మీరట్ నుంచి ఢిల్లీ వైపు వెళుతోంది.

ఈ ఘ‌ట‌న‌లొ కారు నుజ్జునుజ్జయింది. దీంతో మృతదేహాలు(Dead Bodies) కారులో ఇరుక్కుపోయాయి. గ్యాస్ కట్టర్‌(Gas Cutter)తో కారును కోసి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated On 10 July 2023 11:08 PM GMT
Yagnik

Yagnik

Next Story